Reliance: రూ.10 లకే ఐస్ క్రీమ్.. ముఖేశ్ అంబానీ ప్లాన్ ఇదే..!
ఐస్ క్రీమ్ బిజినెస్ లోకి రిలయన్స్ అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్కెట్ ను షేక్ చేసేందుకు ముఖేశ్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వాటర్ నుంచి కూల్ డ్రింక్స్ లో అంబానీ కంపెనీ అడుగు పెట్టి విజయం సాధించారు. క్యాంపా కొనుగోలుతో కూల్ డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన రియలన్స్ రూ.10 ప్రైసింగ్ స్ట్రాటజీ వాడి కోకాకోలా, పెప్సీ కంపెనీలకు పోటీగా నిలిచారు. సేల్స్ ను భారీగా పెంచుకున్నారు. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ లో కూడా ఇదే తరహాలో ముందుకెళ్లాలని రిలయన్స్ నిర్ణయించింది. తక్కువ ధరల్లో ఐస్ క్రీమ్స్ అందించేందుకు సిద్ధమైంది. రోడ్డు పక్కన అమ్మే లోకల్ బ్రాండ్స్ కూడా అందించలేని డెడ్ చీప్ రేట్లకు ఐస్ క్రీమ్ అమ్మనున్నట్లు ప్రకటించింది.
దీంతో ఇప్పటికే వ్యాపారంలో ఉన్న అమూల్, అరుణ్, హిందుస్థాన్ యూనీలివర్, స్కూప్స్ వంటి పెద్దపెద్ద కంపెనీలు భయపడిపోతున్నాయి. తాను ఎంచుకున్న రంగంలో పోటీదారులను చంపేందుకు మార్కెట్ ఆక్యుపై చేసేందుకు ముఖేష్ అంబానీ వాడే ఉచిత ఆఫర్లు, తక్కువ రేట్ స్ట్రాటజీనే మళ్లీ నమ్ముకుని ఈసారి కూడా తన ఐస్ క్రీమ్ బిజినెస్ లో అమలు చేయనున్నారు. లాభం కాదు ముందు మార్కెట్లో స్థానం ముఖ్యమని.. ఆ తర్వాత ప్రత్యర్థిని టార్గెట్ చేయటం రిలయన్స్ సంస్థ విధానంగా ఉంది. జియో, జియో హాట్ స్టార్, క్యాంపా ఇలా ప్రతి కొత్త వ్యాపారంలోనూ ముఖేష్ అంబానీ ఇదే పని చేశారు.

భారతీయ రిటైల్ రంగంలో ఇప్పటికే అనేక సంచలనాలు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు FMCG మార్కెట్లో తన దూకుడు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా సరికొత్తగా 'బాంబే క్రీమరీ' ఐస్ క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యంత పోటీతత్వంతో కూడిన ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్ రంగంలోకి రిలయన్స్ అధికారికంగా అడుగుపెట్టినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఐసీ క్రీమ్స్ ప్రస్తుతం పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి తీసుకోచ్చారు. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది. ఈ కొత్త బ్రాండ్‌లో కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటి వివిధ రకాల వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముఖ్యంగా కేవలం రూ.10 ప్రారంభ ధరతో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంతో సేల్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రముఖ డెలివరీ యాప్‌లలో ఇతర బ్రాండ్ల స్టిక్స్ ధర రూ.20 వరకు ఉండగా.. రిలయన్స్ అంతకంటే తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంబానీ రాకతో అమూల్, వాడిలాల్, మదర్ డైరీ, క్వాలిటీ వాల్స్, బాస్కిన్-రాబిన్స్ వంటి దిగ్గజ బ్రాండ్లకు రిలయన్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications