వరల్డ్ టాప్ 5.. పెరుగుతున్న ముఖేష్ అంబానీ సంపద: 4 నెలల్లో రూ.4 లక్షల కోట్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. తాజాగా ప్రపంచంలోని 5వ కుబేరుడిగా నిలిచారు. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ వ్యాల్యూ ఇటీవల భారీగా పెరిగింది. రూ.2,000 మార్క్ దాటింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్‌తో పాటు అంబానీ ఆస్తులు పెరిగాయి. దీంతో ఆయన ఆస్తులు 75 బిలియన్ డాలర్లకు దగ్గరలో ఉన్నాయి. మన కరెన్సీలో రూ.5.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ టాప్ 5లో ఉన్నారని ఫోర్బ్స్ రియల్ టైమ్ రిచ్ లిస్ట్ ర్యాంకింగ్ తెలిపింది.

ముఖేష్ అంబానీ కంట్ ముందున్నది వీరే..
ప్రస్తుతం ముఖేష్ అంబానీ కంటే నలుగురు ముందున్నారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, ఎల్‌వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ అర్నాల్డ్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ టాప్ 4లో ఉన్నారు. ముఖేష్ అంబానీ వీరి తర్వాత 5వ స్థానంలో నిలిచారు. జియోలోకి ఇటీవల పెట్టుబడులు వెల్లువెత్తాయి. అలాగే రిలయన్స్ షేర్ జీవనకాల గరిష్టానికి చేరుకుంది. దీంతో రిలయన్స్ ఎం-క్యాప్ తద్వారా అంబానీ ఆస్తులు పెరిగాయి.

రూ.13 లక్షల కోట్లు
బుధవారం నాటికి ఆయన సంపదన రూ.7,510 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే రూ.5,61,447 కోట్లు. ప్రపంచం కుబేరుడు జెఫ్ బెజోస్ నెట్ వర్త్ 18,490 కోట్ల డాలర్లు. బిల్ గేట్స్ సంపద 11,350 కోట్ల డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వ్యాల్యూ బుధవారం ఓ సమయంలో రూ.13 లక్షల కోట్లకు చేరింది. నిన్న ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ షేర్ వ్యాల్యూ 1.6 శాతం లాభపడి రూ.2,004 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ ఎం-క్యాప్ రూ.12,70,480 కోట్లకు చేరుకుంది.
- జెఫ్ బెజోస్ సంపద $184.2 బిలియన్లు,
- బిల్ గేట్స్ సంపద $113.5 బిలియన్లు,
- బెర్నార్డ్ అర్నాల్డ్ సంపద $112.8 బిలియన్లు,
- మార్క్ జుకర్ బర్గ్ సంపద $88.3 బిలియన్లు,
- ముఖేష్ అంబానీ సంపద $75 బిలియన్లు,
- లారీ ఎలిషన్ సంపద $72.3 బిలియన్లు,
- ఎలాన్ మస్క్ సంపద $72.2 బిలియన్లు,
- వారెన్ బఫెట్ సంపద $72.2 బిలియన్లు,
- స్టీవ్ బాల్మర్ సంపద $71.8 బిలియన్లు,
- లారీ పేజ్ సంపద $69.4 బిలియన్లు.

4 నెలల్లో రూ.4 లక్షల కోట్లు..
కరోనా మహమ్మారి సమయంలోను జియో ప్లాట్‌ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. లక్షా ఇరవై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. గత ఆరేళ్లలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లు పెరిగింది. అందులో రూ.4 లక్షల కోట్లు గత పది నెలల్లో పెరిగింది. కరోనా సంక్షోభ ప్రభావంతో మార్చి 23న రూ.867.82కి పతనమైన రిలయన్స్ షేర్ ధర జియోలో పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ కారణంగా నాలుగు నెలల్లో భారీగా పెరిగింది.


Click it and Unblock the Notifications