Mukesh Ambani: దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గౌతమ్ అదానీని పోటీలో వెనక్కు నెట్టి తానంటే ఏమిటో మళ్లీ నిరూపించుకున్నారు.
తాజాగా హురున్ గ్లోబర్ రిచ్ లిస్ట్ నివేదిక విడుదలైంది. దీని ప్రకారం ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ నిలిచారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని పోటీలో వెనక్కు నెట్టిన అంబానీ.. జాబితాలో నిలిచిన ఏకైక భారతీయుడిగా రికార్డు సృష్టించారు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గౌతమ్ అదానీ సగటున వారానికి రూ.3,000 కోట్ల సంపదను కోల్పోవటంతో కుబేరుల జాబితాలో ఆయన పేరు కనుమరుగైంది.

హురున్ రిపోర్ట్ ప్రకారం భారత సంపన్నులను చూసినట్లయితే.. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 9వ స్థానంలో, గౌతమ్ అదానీ కుటుంబం 23వ స్థానంలో, సైరస్ ఎస్ పూనావాలా 46వ స్థానంలో, శివ్ నాడార్ కుటుంబం 50వ స్థానంలో ఉండగా లక్ష్శీ ఎన్ మిట్టల్ మాత్రం 76వ స్థానానికి పరిమితమయ్యారు. తాజా నివేదిక ప్రకారం ప్రపచం కుబేరులు సంఖ్య 2023లో 3,112కి పడిపోగా.. అంతకు ముందు ఇది 3,384గా ఉంది. అంటే 2022తో పోల్చినప్పుడు బిలియనీర్ల సంఖ్య దాదాపు 8 శాతం వరకు తగ్గింది.
2023లో దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కుబేరులు భారీగానే నష్టపోయారని తెలుస్తోంది. వివరాల ప్రకారం జెఫ్ బెజోస్ సంపద 70 బిలియన్ డాలర్లు కలిగిపోగా 118 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నారు. ఎలాన్ మస్క్ 48 బిలియన్ డాలర్లను కోల్పోయి 157 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. ఈ క్రమంలో భారతీయుల విషయానికి వస్తే గౌతమ్ అదానీ 28 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయి 53 బిలియన్ డాలర్లతో ఉండగా.. ముఖేష్ అంబానీ 21 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయి 82 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారు.
2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం 18 పరిశ్రమలు, 99 నగరాల నుంచి దాదాపు 176 కొత్త వ్యక్తులు జాబితాలో చేరారు. ఈ క్రమంలో గత ఐదేళ్ల కాలంలో భారత బిలియనీర్లు సుమారు 361 బిలియన్ డాలర్లను వారి సంపదను పెంచుకున్నారు. వీరిలో రేఖా రాకేష్ జున్‌జున్ వాలా, పునావాలా, ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన రాహుల్ బాటియా, రాకేష్ గంగ్వాల్ వంటి వారు ఉన్నారు.


Click it and Unblock the Notifications