అంబానీల రాజసమే వేరప్పా.. కారు పెయింట్ ఖర్చుతో ఫ్యామిలీ లైఫ్ సెటిల్!
Ambani: దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అందరికీ తెలిసినవారే. ఇక ఆయనతో సహా కుటుంబ సభ్యుల లైఫ్‌స్టైల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నివసించే ఇంటి దగ్గర నుంచి ఉపయోగించే కారు వరకు అన్నీ ప్రత్యేకమే. తాజాగా తన కారుకు పెయింట్ వేయడానికి పెట్టిన ఖర్చు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
వ్యాపార విషయాల్లో ఎంతో బిజీగా ఉండే ముఖేష్ అంబానీకి.. లేటెస్ట్ కార్లపై మక్కువ ఎక్కువ. కుటుంబ సభ్యులు ఆకాష్ అంబానీ, నీతా అంబానీ, అనంత్ అంబానీలు సైతం లేటెస్ట్ కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. విలాసవంతమైన ఆయన ఇంట్లో ఈ కార్లను నిలిపేందుకు బహుళ అంతస్తుల పార్కింగ్ సైతం ఉంది.

తాజాగా రోల్స్ రాయిస్ కుల్లినాన్ కారును ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారు. దానిని తనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నారు. ఇండియాలో ఈ కారు ధర 6.8 కోట్లు. కానీ అంబానీకి నచ్చిన విధంగా దాన్ని తీర్చిదిద్దడం వల్ల దాని వెల 13.14 కోట్లకు పెరిగింది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన టస్కాన్ సన్ కలర్ పెయింట్ కారుకు వేయాలని కోరడంతో ఇంత భారీ మొత్తం వెచ్చించాల్సి వచ్చిందట.
అంబానీకి ఇష్టమైన టస్కాన్ సన్ కలర్ పెయింట్ వేయడానికే ఏకంగా కోటి రూపాయలకు పైగా ఖర్చు అయింది. దీనికితోడు కారు ఇంటీరియర్‌లో పలు మార్పులు సైతం చేయడంతో కారు ధర కాస్తా చివరికి 13.14 కోట్లకు చేరింది. దీని కోసం ప్రత్యేకంగా VIP నంబర్ 0001ని కొనుగోలు చేశారు. దీనికి 12 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications