Jio AirFiber: దేశంలో ఇంటర్నెట్ యూజర్లు రోజురోజుకూ పెరగిపోతున్నారు. అయితే ఇదంతా ఒక విధంగా చెప్పుకోవాలంటే అంబానీ తీసుకొచ్చిన 4జీ విప్లవ పుణ్యమే. అయితే ఇప్పుడు అందరూ 5జీ వేగానికి మారుతుండగా యూజర్లకు శరవేగవంతమైన నెట్ సౌకర్యాన్ని అందించే లక్ష్యంగా జియో ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది జరిగిన షేర్ హోల్డర్ల సమావేశంలో జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను ప్రకటించింది. ఈ సాంకేతికత ద్వారా జియో వైర్‌లెస్‌గా వినియోగదారులకు.. ఫైబర్ స్పీడ్‌తో అంతర్జాల సేవలను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దీనికోసం కంపెనీ 5జీ యాంటెన్నాను ఉపయోగించనుంది. Jio AirFiberలో వినియోగదారులు గరిష్ఠంగా 1Gbps వేగాన్ని పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.

అయితే ఈ సేవలు ఎప్పటి నుంచి దేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయనే తేదీని అధికారికంగా వెల్లడించలేదు. అయితే త్వరలోనే కంపెనీ దీనిని ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. మరో ఒకటి రెండు నెలల్లో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్న తరుణంలో దాని ప్రత్యేకలు ఇప్పుడు తెలుసుకుందాం.
జియో ఎయిర్‌ఫైబర్ అన్‌బాక్సింగ్,ఇన్‌స్టాలేషన్‌ను చూపుతున్న వీడియో యూట్యూబ్‌లో ఉంది. ఇప్పటికే ఈ సేవను పైలట్ ప్రాజెక్ట్ కింద కంపెనీ కొంత కాలంగా పరీక్షిస్తోంది. ఈ సేవ పోర్టబుల్, నాన్ పోర్టబుల్ వేరియంట్లలో ఉండవచ్చని వీడిలో ప్రకారం తెలుస్తోంది. ఇది Wi-Fi 6 మద్దతుతో వస్తుంది. అంచనా ప్రకారం దీని ధర రూ.5,500 నుంచి రూ.6,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. యాంటినాను ఇంటిపై ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా.. ఎక్స్‌టెండర్‌గా పనిచేసే మరొకదానిని ఇంటి లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది.
హార్డ్‌వేర్ ఇన్టలేషన్ పూర్తయిన తర్వాత.. నెట్‌వర్క్ కనెక్షన్‌ని జోడించడం ద్వారా ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయాలి. ఇందుకోసం ముందుగా AirFiberలో Jio 5G SIMని ఇనసర్ట్ చేయాలి. ఆ తర్వాత Jio Home యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. జియో ఫైబర్ రూటర్ కి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత వైఫై పాస్ వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. దీనిలో వైర్‌లెస్ కనెక్షన్‌తో పాటు.. USB పోర్ట్, LAN, WAN పోర్ట్‌లను పొందుతారు. అయితే పోర్టబుల్ వేరియంట్ గురించి అనేక విషయాలు కంపెనీ నుంచి వెల్లడి కావాల్సి ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications