Ambani News: మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగించే ఇంధనంలోనూ భారీ మార్పులు జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాడకం నుంచి క్రమేపీ క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ స్వచ్ఛ ఇంధనం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కనున్నట్లు ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమున్న 3.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ వృద్ధి ప్రయాణంలో స్వచ్ఛ ఇంధన వనరులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ మేరకు పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ హోదాలో గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఇచ్చిన సందేశంలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఈ దశాబ్దం చివరి నాటికి దేశీయ ఇంధన అవసరాలు రెట్టింపు అవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు డిమాండ్‌ను అందుకునేందుకు.. భారత్ మౌలిక సదుపాయాల కల్పన దిశగా పోటీ పడుతుందన్నారు. ప్రతి పౌరుడికీ, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు అత్యంత చవకైన ఇధనం అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఇంధన పరివర్తనలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి స్మార్ట్ మరియు స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయగల సత్తా భారత్ కు ఉందన్నారు. భారత్ లోని అత్యంత ప్రతిభావంతులైన యువతపై తనకు నమ్మకం ఉన్నట్లు చెప్పారు. కొన్నిసార్లు భంగపడినా, తిరిగి ధైర్యంగా లక్ష్యం వైపు కొనసాగే ఆత్మవిశ్వాసం వారిలో ఉందన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications