Reliance: ముఖేష్ అంబానీ ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టినా అక్కడ ముందుగా జరిగేది ధరల యుద్ధమే. అవును భారతీయ వినియోగదారుల నాడి పట్టిన రిలయన్స్ అధినేత అందుకు అనుగుణంగా ఉచితాలు, తక్కువ ధరలతో తన కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తుంటారు. అయితే ఆయన నేతృత్వంలోని రిలయన్స్ తాజాగా ఎఫ్ఎమ్సీజీ, హోమ్ కేర్ విభాగంలోకి అరంగేట్రం చేసింది.
వినియోగదారులు రోజువారీగా వినియోగించే వస్తువుల వ్యాపారంలో ప్రజలకు చేరువయ్యేందుకు అంబానీ తన ప్రైస్ వార్ స్ట్రాటజీని తిరిగి తెరమీదకు తెచ్చారు. దీంతో సబ్బుల నుంచి కూల్ డ్రింక్స్ వరకు అన్ని ఉత్పత్తులను రిలయన్స్ మార్కెట్లోని ఇతర ప్రత్యర్థి సంస్థల కంటే దాదాపు 30 నుంచి 35 శాతం తక్కువ ధరలకు అందిస్తోంది. రిలయన్స్ గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయ కంపెనీలతో పాటు విదేశీ సంస్థలు సైతం ఆందోళన చెందుతున్నాయి.

అంబానీ నిర్ణయం అమెరికాకు చెందిన ప్రఖ్యాత హిందుస్థాన్ యూనీలివర్, ప్రాక్టర్ గ్యాంబుల్ వంటి సంస్థలనే కాక చాలా దేశీయ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది. ద్రవ్యోల్బణ సమయంలో కంపెనీలు పెరుగుతున్న ఖర్చుల కారణంగా ధరలను పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండగా.. మరో పక్క ముఖేష్ అంబానీ ఉత్పత్తులను మరింత తక్కువకు అందించాలనుకోవటం లాభాలపై భారీ ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఇండిపెండెన్స్ పేరుతో కంపెనీ తన ఉత్పత్తులను తొలుత గుజరాత్ రాష్ట్రంలో రిలయన్స్ విక్రయించింది. రెండో దశలో దేశవ్యాప్తంగా డీలర్ షిప్ నెట్‌వర్క్ ను అభివృద్ధి చేసి ప్రతి మారుమూర ప్రాంతానికి తమ ఉత్పత్తులను చేరువ చేయాలని కంపెనీ పెద్ద ప్రణాళికతో ముందుకు సాగుతోంది. దీనికి తోడు ఇప్పటికే కంపెనీకి దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాలు, ఈ-కామర్స్ జియో మార్ట్ తో పాటు చిల్లర దుకాణాలకు సరఫరా చేసే జియో హోల్ సేల్ ఛానల్ ఉంది. ఇవి కంపెనీ వేగంగా మార్కెట్లోకి చొచ్చుకుపోయేందుకు సహాయకారిగా నిలుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో రూ.75 వేల కోట్ల విలువైన భారత కూడ్ డ్రింక్స్ మార్కెట్లో క్యాంపాకోలాతో పెప్పికో, కోకాకోలాకు ఎదురెళుతోంది రిలయన్స్. ఇదే క్రమంలో పర్సనల్ కేర్, ఎఫ్ఎమ్సీజీ రంగంలో రూ.1.78 లక్షల కోట్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో 100 గ్రాముల.. గ్లిమ్మర్ బ్యూటీ సోప్స్, గెట్ రియల్ నేచురల్, ప్యూరిక్ హైజీన్ సబ్బులు కేవలం రూ.25కి అందిస్తూ ప్రత్యర్థి కంపెనీలకు పెద్ద పోటీని ఇస్తోంది. దీనికి తోడు వాషింగ్ మెషీన్ లిక్విడ్స్, డిష్ వాషింగ్ సోప్స్ వంటి ఇతర ఉత్పత్తులను సైతం ఆకర్షనీయమైన ధరలకు అందుబాటులోకి తెచ్చింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications