న్యూఢిల్లీ: ఆయిల్, టెలికం మొదలు రిటైల్ రంగం వరకు వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉనన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో ఘనత సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లకు చేరుకుంది. నవంబర్ 19న ట్రేడింగ్‌లో RIL షేర్లు ఇంట్రాడేలో గరిష్టంగా 3.87 శాతం లాభపడి, రూ.1500కు చేరుకుంది. బుధవారం (20 నవంబర్ 2019) తేదీ కూడా ఈ షేర్ దూసుకెళ్లింది. మధ్యాహ్నం గం.12 సమయానికి రూ.52.40 (3.47%) పెరిగి రూ.1,562.15కు చేరుకుంది. ప్రపంచంలోని ఆరు సూపర్ మేజర్ ఆయిల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ వ్యాల్యూ గడిచిన ఏడాది కాలంలో 35 శాతానికి పైగా లాభపడింది. రిలయన్స్ షేర్ ధర మంగళవారం గరిష్టంగా రూ.1514 తాకింది. అనంతరం బీఎస్ఈలో మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర రూ.1510 వద్ద స్థిరపడింది. బుధవారం రూ.1562ను తాకింది. డాలర్ మారకంలో రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ 133 బిలియన్ డాలర్లుగా ఉంది. తద్వారా బ్రిటిషన్ ఎనర్జీ దిగ్గజం BPని దాటివేసింది. BP మార్కెట్ క్యాప్ 132 బిలియన్ డాలర్లు.

రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ గత నెలలో తొలిసారి BPని క్రాస్ చేసింది. ఇప్పుడు మరోసారి దాటింది. మార్కెట్ క్యాప్ ప్రకారం చైనా అతిపెద్ద చమురు సంస్థ పెట్రో చైనా-కోకు సమీపంలో రిలయన్స్ ఉంది. రానున్న 18 నెలల్లో కంపెనీ రుణాలను జీరోగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేష్ అంబానీ ఆగస్ట్ నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, సౌదీ ఆరామ్‌కోతో కలిసి సాగనుంది. షేర్ల ధర పెరుగుదలతో అంబానీ నెట్ వర్త్ 56 బిలియన్ డాలర్లు పెరుగుతుంది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications