Reliance Jio: అంబానీ 5G దూకుడు.. లక్ష ఆధునిక సెల్ టవర్లతో సిద్ధం.. ఎయిర్‌టెల్ తట్టుకోగలదా..?
Reliance Jio: దేశీయ టెలికాం రంగంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో అడుగుపెట్టక ముందు వరకు లెక్కలు వేరేగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి పూర్తిగా మారిపోయాయి. కస్టమర్లు మెచ్చే సేవలతో పాటు వేగవంతమైన ఇంటర్నెస్ సౌకర్యాన్ని ప్రతిమారుమూలకు చేర్చాలనే సంకల్పంతో జియో వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం వేలకోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది.
జియో భారతదేశంలో అత్యంత వేగవంతమైన 5G టెలికాం నెట్‌వర్క్‌ను రూపొందించడానికి, అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి సిద్ధమైంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు లక్ష టెలికాం టవర్లను నిర్మించింది. ఈ సంఖ్య సమీప ప్రత్యర్థిగా ఉన్న ఎయిర్‌టెల్ సామర్థ్యాల కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) డేటా వెల్లడించింది.

రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 700 MHz, 3,500 MHz కలిగిన 99,897 బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేసింది. ఇదే సమయంలో మార్కెట్లో అతిపెద్ద టెలికా ఆపరేటర్లలో ఒకటైన ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతానికి 22,219 స్టేషన్లను కలిగి ఉంది. మార్చి 23 నివేదికలు ప్రతి బేస్ స్టేషన్‌కు, Jioకి 3 సెల్ సైట్‌లు ఉండగా, Airtelకి 2 ఉన్నాయి. ఇక వేగం విషయానికి వస్తే నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ అంతర్దృష్టులలో గ్లోబల్ లీడర్ అయిన Ookla అందించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 28 నాటికి ఎయిర్‌టెల్ 268 Mbps స్పీడును కలిగి ఉండగా.. రిలయన్స్ జియో 506 Mbps స్పీడ్ వేగంతో ఇంటర్నెస్ సేవలను అందిస్తున్నాయి.
దేశంలో నూతన 5జీ మెుబైల్ నెట్ వర్క్ సాంకేతికత వచ్చి ఇప్పటికే దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. ఈ క్రమంలో జియో వేగంగా తన సేవలను దేశంలోనికి ప్రధాన నగరాలకు విస్తరిస్తూ పోతోంది. 5జీ సేవలు అందుబాటులోకి రావటంతో డౌన్ లోడ్ వేగం దాదాపు 113 శాతం పెరిగిందని ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం తెలుస్తోంది. చైనా తర్వాత అతిపెద్ద ఇంటర్నెస్ వినియోగదారులు కలిగిన మార్కెట్ భారత్ కావటంతో ఇక్కడ తన సామర్థ్యాన్ని పెంచుకుని లాభాలను గడిస్తున్నారు ముఖేష్ అంబానీ. ప్రస్తుతం జియో 5జీ వేగం భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ దానిని పరిష్కరించేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.


Click it and Unblock the Notifications