Mukesh Ambani: వరుసగా అప్పులు చేసుకుపోతున్న అంబానీ.. అందుకోసమే..?
Mukesh Ambani: ఇప్పటి వరకు అప్పులు అనగానే అదానీ గ్రూప్, వేదాంత వార్తల్లో వినిపించేవి. ఇదే క్రమంలో సైలెంట్‌గా తన ప్రణాళికల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చుకుంటూ పోతున్నారు రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ.
మూడు బిలియన్ డాలర్ల రుణాన్ని పొందేందుకు సంతకాలు చేసిన కొద్ది రోజులకే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కోసం 2 బిలియన్ డాలర్ల రుణ సదుపాయాన్ని సేకరించింది. ఐదేళ్లలో భారతీయ కార్పొరేట్ సంస్థ సిండికేట్ టర్మ్ లోన్‌ల ద్వారా నిధులను సమీకరించిన వాటిలో ఇది అతిపెద్దదని ఈ డీల్‌లో పాల్గొన్న వర్గాలు వెల్లడించాయి.

3 బిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్ మార్చి 31న ముగిసింది. ఈ రుణ ప్రాథమిక సిండికేషన్‌లో మెుత్తం 55 రుణదాతలు ఉన్నారు. వీటిలో రెండు డజన్ల తైవానీస్ బ్యాంకులు ఉన్నాయి. వీటికి తోడు ప్రపంచ ప్రఖ్యాత బ్యాంక్ ఆఫ్ అమెరికా, HSBC, MUFG, Citi, SMBC, Mizuho, Credit Agricole కూడా ఉన్నాయి. అయితే తాజాగా కంపెనీ సేకరించిన రెండు బిలియన్ డాలర్ల రుణం విషయంలోనూ గత రుణ నిబంధనలను కలిగి ఉంది. ఈ రుణాన్ని అందించేందుకు దాదాపు 40 సంస్థలు సిండికేట్ అయ్యాయి.
ఆయిల్ నుంచి టెలికాం వరకు విజయవంతమైన వ్యాపారాలను నిర్వహిస్తూ ముకేష్ అంబానీ ముందుకు సాగుతున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో నిధుల సమీకరణ కోసం రిలయన్స్ గ్రూప్ సిండికేటెడ్ లోన్ మార్కెట్‌లో క్రియాశీలకంగా లేదు. ఈ క్రమంలో బ్లూ చిప్ కంపెనీకి రుణాలను అందించేందుకు మార్కెట్ నుంచి మంచి స్పందన లభించటంతో రెండు బిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని అంబానీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి ముందు 2020లో చివరిసారిగా రిలయన్స్ సిండికేట్ ఆఫ్‌షోర్ రుణాన్ని పొందింది.
దేశంలో 5జీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో అందుకు భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో గత సంవత్సరం మూలధన వ్యయం అవసరాల కోసం దాదాపు 750 మిలియన్ డాలర్ల ఐదేళ్ల కొత్త-మనీ క్లబ్ రుణాన్ని పొందింది. తాజాగా కంపెనీ సమీకరించిన నిధులను జియో నెట్ వర్క్ విస్తరణకు, రిటైల్ వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications