రిలయన్స్ నుండి కరోనా కోసం టేప్‌వార్మ్ డ్రగ్, తక్కువ ధరకే నిర్ధారణ పరీక్ష
కరోనా చికిత్సలో వినియోగించే ఔషధాలు ఆవిష్కరించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నిక్లోసామైడ్ అనే మెడిసిన్‌ను కరోనా చికిత్సలో వినియోగించాలని ప్రతిపాదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అత్యవసర ఔషధాల్లో ఇది ఒకటి. దీనిని 50 ఏళ్లుగా టేప్ వార్మ్ ఇన్ఫెక్షన్‌లో వినియోగిస్తున్నారు. 2003-04లో ఆఫ్రికా దేశాల్లో, ఇతర మరికొన్ని దేశాల్లో వెలుగుచూసిన సార్స్ వ్యాధికి చికిత్సలో డాక్టర్లు ఈ మెడిసిన్‌ను సిఫార్స్ చేశారు. నిక్లోసామైడ్ మెడిసిన్ కరోనా బాధితులకు చికిత్సలో వినియోగించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేశామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక నివేదికలో తెలిపింది.

ఇప్పటికే పరీక్షలు
మన దేశంలో కరోనా బాధితులపై ఈ మెడిసిన్‌ను ఇప్పటికే పరీక్షిస్తున్నారు. దీనిపై రెండో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. ఇదే కాకుండా నెగ్జర్ పాలీమర్ అనే మెడిసిన్ పైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ అండ్ డీ బృందం దేశంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబ్‌లతో కలిసి పరీక్షలు నిర్వహిస్తోంది. పలు రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా వల్ల మనుషుల శరీరంలో ఏర్పడే లిపిడ్ పొరను నాశనం చేసేందుకు ఈ మెడిసిన్ ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

టెక్నాలజీ సవాళ్ళు
రిలయన్స్‌లో 900 మందికి పైగా సైంటిస్ట్‌లు, పరిశోధకులు పని చేస్తున్నారు. వివిధ రకాల టెక్నాలజీ సవాళ్లకు సమాధానాలు కనుగొనడం వీరి పని. ఇందులో కొన్ని బృందాలు ఇప్పుడు కరోనాకు పరిష్కార మార్గాలు అన్వేషించే పనిలో నిమగ్నమయ్యాయి.

ఆక్సిజన్ సిలిండర్లు
కరోనా నిర్థారణకు తక్కువ ధరల్లో లభించే డయాగ్నస్టిక్ కిట్స్‌ను కూడా రిలయన్స్ అభివృద్ధి చేస్తోంది. కొన్నింటిని ఆవిష్కరించింది. వీటికి ICMR గుర్తింపు లభించింది. ఎంతో తక్కువ ధరలో శానిటైజర్లను తయారు చేసే ప్రాసెస్‌ను అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్లు ఉన్న గదుల కొరతను పరిగణనలోకి తీసుకుని సిపాప్ మెషీన్‌ను ఆవిష్కరించే పనిలో ఉంది. ఆక్సిజన్ జనరేటర్లను డిజైన్ చేసే ప్రాజెక్టును చేపట్టింది.


Click it and Unblock the Notifications