Ambani News: ముఖేష్-ఇషా అంబానీ కొత్త ప్లాన్.. ఇక జూడియో-మైంత్రాలకు చుక్కలే..!!
Reliance Retail: దేశంలోని సంపన్న వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఇప్పటికే ఉన్న వ్యాపారాలను బలపరచటంతో పాటుగా కొత్త వ్యాపారాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇషా అంబానీతో కలిసి మాస్టర్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ రానున్న కొద్ది రోజుల్లో చైనీస్ ఫాస్ట్-ఫ్యాషన్ బ్రాండ్ షీన్‌ను భారత మార్కెట్లోకి పరిచయం చేయడానికి సిద్ధమౌతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక ఒప్పందం జరిగింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో వ్యాపారం చేస్తున్న షీన్ ఉత్పత్తులను ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ తన యాప్స్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా భారత కస్టమర్లకు విక్రయించాలని నిర్ణయించారు.

చాలా కాలంగా భారతదేశంలో ఫాస్ట్-ఫ్యాషన్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఈ మార్కెట్లో కీలక వాటాను జూడియో, మైంత్రా కంపెనీలకు ధీటుగా పోటీ ఇచ్చేందుకు చాలా కాలంగా ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అనేక ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్లను భారత మార్కెట్లలోకి ప్రవేశపెడుతోంది. రిలయన్స్ రిటైల్ భారతదేశంలో షీన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మాజీ మెటా డైరెక్టర్ మనీష్ చోప్రాను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పాశ్చాత్య ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌ల కంటే ముందంజలో ఉండటానికి, వాటిని త్వరగా భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి రిలయన్స్ రిటైల్ ఎంపిక చేసిన యూరోపియన్ నగరాల్లో బోటిక్ స్టూడియోలను ఏర్పాటు చేస్తోంది.
250 మిలియన్లకు పైగా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న గ్లోబల్ రిటైలర్ షీన్ రిలయన్స్‌తో భాగస్వామ్యం ద్వారా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. భారత్ నుంచి తన సోర్సింగ్‌ను విస్తరించడంలో షీన్‌కు సహాయం చేయడం ఈ సహకారం లక్ష్యం. అగ్రిమెంట్లో భాగంగా దేశం నుంచి వస్త్రాలు, వస్త్రాల ఎగుమతులను పెంచుతుంది. షీన్ రిలయన్స్ రిటైల్‌కు 25,000 కంటే ఎక్కువ MSMEల నెట్‌వర్క్‌ను ఏకీకృతం చేయడానికి సాంకేతికత, నైపుణ్యాన్ని అందజేస్తుంది.
రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనాల ప్రకారం భారత ఫాస్ట్ ఫ్యాషన్ మార్కెట్ 2031 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 50 బిలియన్ డాలర్లను అధిగమిస్తుందని అంచనా వేసింది. 2023లో షీన్ కంపెనీ తన వ్యాపారం ద్వారా 2 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించింది. కంపెనీని న్యూయార్క్ లేదా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ చేసేందుకు బీజింగ్ నుంచి అవసరమైన అనుమతుల కోసం కంపెనీ వేచి చూస్తోంది.


Click it and Unblock the Notifications