Mukesh Ambani: ఎప్పుడూ మనం దేశంలో అత్యంత సంపద కలిగిన ధనికుల గురించే వింటుంటాం. అయితే వారి అప్పుల గురించి తెలుసుకుంటే నిజంగా కళ్లు తిరగక మానవు.
వివరాల్లోకి వెళితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అప్పులు కలిగిన వ్యక్తిగా నిలిచారు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఏమిటంటే అదానీ గ్రూప్ కంపెనీలు ఈ జాబితాలో లేకపోవటమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మెుత్తం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు ఉన్నట్లు తాజా డేటా ప్రకారం వెల్లడైంది. దీంతో దేశంలో అధికంగా అప్పులు కలిగిన వ్యాపారవేత్తగా ముఖేష్ అంబానీ వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో రతన్ టాటా కంపెనీలు అంబానీ రిలయన్స్ కంటే తక్కువగా అప్పులను కలిగి ఉన్నట్లు వెల్లడైంది.

అయితే అత్యంత రుణాలను కలిగి ఉన్న రెండవ అతిపెద్ద కంపెనీగా దేశీయ ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఎన్టీపీసీ నిలిచింది. పవర్ రంగంలో కొనసాగుతున్న కంపెనీ మెుత్తం అప్పులు రూ.2.20 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక మూడువ స్థానంలో అత్యంత అప్పులు కలిగి ఉన్న కంపెనీగా టెలికాం దిగ్గజం ఒడాఫోన్ ఐడియా రూ.2.01 లక్షల కోట్లతో నిలిచింది. దీని తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన భారతీ ఎయిర్ టెల్ కంపెనీ అప్పులు రూ.1.65 లక్షల కోట్లుగా ఉన్నాయి.
దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.1.40 లక్షల కోట్ల అప్పుల్లో ఉండగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ రూ.1.29 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తోంది. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.1.26 లక్షల కోట్లు, టాటా మోటార్స్ రూ.1.25 లక్షల కోట్ల అప్పును కలిగి ఉండగా.. చంద్రయాన్ మిషన్ లో కీలక పాత్ర పోషించిన లార్సెన్ అండ్ టూబ్రోకు రూ.1.18 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇక చివరగా లక్ష కోట్ల కంటే ఎక్కువ అప్పులు కలిగిన కంపెనీగా చివరి స్థానంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ జాబితాలో చివరను రూ.1.01 లక్షల కోట్ల అప్పును కలిగి ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications