Reliance Q1 Results: ముకేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల విడదలో కోసం ఉదయం నుంచి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసికంలో రూ.16,011 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది మార్కెట్లు అంచనా వేసిన దానికంటే తక్కువ. ఏడాది ప్రాతిపదికన కంపెనీ లాభాలు 11 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇదే క్రమంలో నిర్వహణ ఆదాయం 5.3 శాతం తగ్గి రూ.2.07 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో రిలయన్స్ బోర్డు పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.9 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది.

లాభాలు తగ్గినప్పటికీ రిటైల్ వ్యాపారం నుంచి ఆదాయం 19 శాతం పెరిగినట్లు యాజమాన్యం వెల్లడించింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.17,955 కోట్లుగా.. మెుత్తం ఆదాయం రూ.2.19 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో EBITDA మార్జిన్ గత ఏడాది కాలంతో పోల్చితే మెరుగుపడి 18.3 శాతంగా నమోదైంది.
రిటైల్, టెలికాం విభాగాల్లో స్థిరమైన వృద్ధి ఉన్నప్పటికీ.. O2C వ్యాపారంలో బలహీనమైన వృద్ధి కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెుదటి త్రైమాసిక ఫలితాలు తగ్గుదలకు కారణంగా బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ లాభం రూ.16,995 కోట్లుగా అంచనా వేశారు.
ఇదే క్రమంలో రిలయన్స్ జియో సైతం లాభాలు నెమ్మదించి మార్కెట్ అంచనాలు అందుకోలేకపోయింది. మెుత్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం తొలిత్రైమాసికంలో 18 శాతం మేర తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ స్టాక్ నష్టాల్లో ట్రేడింగ్ ముగించింది.


Click it and Unblock the Notifications