Reliance Industries: భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అదానీ గ్రూప్‌తో సమానంగా తన వ్యాపారాన్ని విస్తరించడం ప్రారంభించిందని మనందరికీ తెలుసు. కానీ స్వల్ప తేడాతో అదానీ గ్రూప్ మాత్రం కొత్త రంగాలు, కొత్త వ్యాపారాలు, అనుభవం లేని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తోంది.

దూకుడు పెంచిన అదానీ..
ఇదే సమయంలో రిలయన్స్ గ్రూప్ అధినేత కొత్త కంపెనీలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఆయన అనుభవం ఉన్న వ్యాపారాల విస్తరణకు ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని సార్లు మాత్రం పరిశ్రమలో ఇప్పటికే పనిచేస్తున్న ప్రత్యర్థి కంపెనీలను హస్తగతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

సుబలక్ష్మి కంపెనీల కొనుగోలు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ పెట్రోలియం రిటైల్ లిమిటెడ్.. తాజాగా రెండు కంపెనీలను సొంతం చేసుకుంది. అవి.. సుబలక్ష్మి పాలిస్టర్స్ లిమిటెడ్ (SPL), సుబలక్ష్మి పాలిటెక్స్ లిమిటెడ్ (SPDEX). దీని ద్వారా పాలిస్టర్ వ్యాపారంలో కంపెనీ మార్కెట్ ను రిలయన్స్ చేజిక్కించుకుంది.

1,600 కోట్ల డీల్..
సుబలక్ష్మి పాలిస్టర్స్ రూ.1,522 కోట్లు, సుబలక్ష్మి పాలిటెక్స్ లిమిటెడ్ రూ.70 కోట్లు అంటే మొత్తం రూ.1,592 కోట్లకు రిలయన్స్ పెట్రోలియం రిటైల్ లిమిటెడ్ రెండు కంపెనీలను మొత్తంగా కొనుగోలు చేయడం లేదు. కానీ పాలిస్టర్ వ్యాపార తయారీ స్థావరాన్ని మాత్రమే కొనుగోలు చేస్తోంది.

పాలిస్టర్ వ్యాపార విస్తరణ..
తాజా కొనుగోళ్ల ద్వారా రిలయనస్ పాలిస్టర్ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించింది. సుబలక్ష్మి పాలిస్టర్స్, సుబలక్ష్మి పాలిటెక్స్ కలిసి వార్షికంగా రూ.2,300 నుంచి రూ.3,000 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయి. కానీ గత 3 సంవత్సరాల్లో వ్యాపారంలో నిరంతర క్షీణత ఉంది.

సుబలక్ష్మి పాలిస్టర్స్..
సుబలక్ష్మి పాలిస్టర్స్ ఏడాదికి 2,52,000 మిలియన్ టన్నుల పాలిమరైజేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రత్యక్ష పాలిమరైజేషన్ మార్గం, ఎక్స్‌ట్రూడర్ స్పిన్నింగ్ ద్వారా పాలిస్టర్ ఫైబర్, నూలు, టెక్స్‌టైల్ గ్రేడ్ చిప్‌లను తయారుచేస్తోంది. కంపెనీకి గుజరాత్ రాష్ట్రంలోని దహేజ్, సిల్వాసా వద్ద రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications