Mukesh Ambani: దాదాపు ఏడాది కాలం నుంచి రిలయన్స్ గ్రూప్ చాలా వేగంగా తన వ్యాపార విస్తరణను అన్ని విభాగాల్లో ముందుకు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అనేక పేరున్న కంపెనీలను విలీనం చేసుకుంటూ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మరో డీల్ జరగటం గమనార్హం.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ కంపెనీ తాజాగా మరో భారీ డీల్ ఫైనల్ చేసింది. వాస్తవానికి కంపెనీ 82 ఏళ్ల రావల్‌గావ్ షుగర్ ఫామ్‌కు చెందిన కాఫీ బ్రేక్ అండ్ పాన్ పసంద్ వంటి మిఠాయి బ్రాండ్‌లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. రావల్‌గావ్ షుగర్ ఫామ్స్ మాంగో మూడ్, కాఫీ బ్రేక్, టుట్టి ఫ్రూటీ, పాన్ పసంద్, చోకో క్రీమ్, సుప్రీమ్ వంటి బ్రాండ్‌లను కలిగి ఉంది. అంబానీ తాజా డీల్ ద్వారా వీటికి సంబంధించిన ట్రేడ్‌మార్క్‌లు, తయారీ రెసిప్పీ, ఇతర హక్కులను డీల్ కింద రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) దక్కించుకుంది. RCPL అనేది రిలయన్స్ గ్రూప్ రిటైల్ యూనిట్ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.

తాజా డీల్ విలువ దాదాపు రూ.27 కోట్లకు జరిగింది. దీంతో కంపెనీకి చెందిన బ్రాండ్‌ల ట్రేడ్‌మార్క్‌లు, మేధో సంపత్తి హక్కులను అంబాని సంస్థకు బదిలీ చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో రావల్‌గావ్ షుగర్ ఫామ్ తెలిపింది. అయితే రావల్‌గావ్ షుగర్ ప్రతిపాదిత ఒప్పందం తర్వాత కూడా ఆస్తి, భూమి, ప్లాంట్, భవనం, పరికరాలు, యంత్రాలు వంటి ఇతర ఆస్తులన్నీ తమ వద్దే ఉంటాయని తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా తమ మిఠాయి వ్యాపారాన్ని కొనసాగించడం కష్టతరంగా మారటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. అలాగే మార్కెట్లో చాలా వాటాను కంపెనీ కోల్పోయిన సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీ అయిన రావల్‌గావ్ షుగర్ షేర్లు రూ.785 స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. అంబానీకి చెందిన రిలయన్స్ ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు తెలియటంతో షేర్లలో ఒక్కసారిగా బూమ్ కనిపించింది. నవంబర్ నెలలో ఈ షేరు ధర రూ.1,157.25కి పెరిగింది. ఇది స్టాక్‌లో 52 వారాల గరిష్ఠ ధరగా నిలిచింది. అలాగే మార్చి 2023లో కంపెనీ షేరు ధర 52 వారాల కనిష్ఠమైన రూ.596.20కి చేరుకుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications