Mukesh Ambani: అంబానీ కొత్త వ్యాపారం.. ఆ 5 కంపెనీలకు ఎసరు.. టాటాలు కూడా..
Mukesh Ambani: ఇషా అంబానీ తండ్రికి మించిన తనయగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఉన్న వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లటంతో పాటు కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతూ ప్రత్యర్థులకు ఆలోచించే సమయం కూడా ఇవ్వటం లేదు.
దేశంలో ఈస్తటిక్ కేఫ్‌లు, స్వదేశీ కాఫీ చెయిన్‌లకు డిమాండ్ పెరుగుతున్న వేళ.. రిలయన్స్ బ్రాండ్స్ ఇప్పుడు భారతదేశానికి లండన్ ఆధారిత రెస్టారెంట్ చైన్‌తో జతకట్టింది. "most Instagrammable cafes" తీసుకొచ్చేందుకు భారీ కసరత్తును మెుదలు పెట్టింది. రిలయన్స్ బ్రాండ్స్ లండన్‌కు చెందిన EL&N కేఫ్ చైన్ ను ఇండియాలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఈ ఏడాది జరిగిన త్రైమాసిక సమావేశంలో వెల్లడించింది.

EL&N కేఫ్స్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ప్రత్యేకమైన ఆహార పానీయాల రిటైల్ బ్రాండ్. ఇప్పటికే ఇది ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్, ఇటలీ, లండన్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో తన మార్కెట్‌ను విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 27కి పైగా సంస్థలను కలిగి ఉంది. EL&N ఫ్రెంచ్, అరేబియన్-నేపథ్య ఇంటీరియర్స్, యూత్-సెంట్రిక్ వాతావరణంతో అత్యంత సుందరమైన, సౌందర్య కేఫ్‌లను కలిగి ఉన్న బ్రాండ్‌గా గుర్తింపును కలిగి ఉంది.
దీనికి ముందు రిలయన్స్ రిటైల్ ప్రముఖ యూకే శాండ్‌విచ్ & కాఫీ చైన్ ప్రెట్ ఎ మాంగర్‌తో జతకట్టింది. దేశంలో తొలి అవుట్‌లెట్‌ను ముంబైలో ప్రారంభించింది. అంబానీల కొత్త కాఫీ చెయిన్ టాటా గ్రూప్‌కు చెందిన స్టార్‌బక్స్‌కు గట్టి పోటీనిస్తుంది. 2024 తొలి నెలల్లో ముఖేష్ అంబానీ దేశంలో మొదటి EL&N కేఫ్ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. అద్భుతమైన పింక్ ఇంటీరియర్, తక్కువ ధరలు, ఆహారాలు దీని బలాలుగా ఉన్నాయి. అంబానీ రాకతో ది బిగ్ చిల్, డిగ్గిన్, కేఫ్ ఢిల్లీ హైట్స్, స్టార్‌బక్స్, కోస్టా కాఫీ వ్యాపారాలకు ముప్పు తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications