Mukesh Ambani: దేశంలో ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే పనిలో వేగంగా ముందుకు సాగుతున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. ఈ క్రమంలో స్వాతంత్య్రానికి ముందు ప్రారంభమైన ప్రముఖ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నమ్‌కీన్ రంగంలో అంబానీ..
నిజానికి దేశంలో నమ్‌కీన్స్ తినేవాళ్లకు కొదవ లేదు. అందువల్ల స్నాక్స్ తయారీ రంగంలో ఉన్న కంపెనీలు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు పరియచం చేస్తూనే ఉన్నాయి. 2026 నాటికి నమ్‌కీన్ మార్కెట్ 2.88 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి. అందుకే అంబానీకి చెందిన రిలయన్స్ దీనిని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది.

దూసుకుపోతున్న విదేశీ కంపెనీలు..
స్నాక్స్ రంగంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. అనేక బహుళజాతి కంపెనీలు ఇప్పటికే ఇండియాలో పాగా వేసి ప్రజల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నాయి. అవి శరవేగంగా దూసుకుపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంబానీల రాకతో ఈ పోటీ రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. అందువల్ల పోటీని తట్టుకుని ముందుకు సాగటం కష్టమవుతుందని భావించి ఆకాష్ నమ్‌కీన్ కంపెనీని విక్రయిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

1936లో ప్రారంభం..
ఆకాష్ నమ్‌కీన్ కంపెనీ స్వాతంత్య్రానికి ముందు 1936లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం కంపెనీకి 7 కో-ప్యాకింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. కంపెనీ తన ఉత్పత్తులను అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ప్రసిద్ధ ఉత్పత్తులు.
.
నామ్‌కీన్‌లో రత్లామి సెవ్, మూంగ్ దాల్, బూందీ, మిశ్రమం, వేరుశెనగ, జీడిపప్పు మసాలా, సాలేటెడ్ జీడిపప్పు, ఉప్వాస్ చివ్డా, సోయా స్టిక్, భావనాగ్రి గాంథియా, భుజియా ఉన్నాయి. డైట్ శ్రేణిలో మఖానా, బాంబే ఫటాఫట్ భెల్, లైట్ చివ్డా, లైట్ మిక్స్ ఉన్నాయి. స్వీట్‌లో లడ్డు, సోహన్ పాప్డి, రసగుల్లా, గులాబ్ జామూన్ ఉన్నాయి. కంపెనీ ప్రతిరోజూ 1,00,000 ప్యాకెట్లలో 40 టన్నుల కంటే ఎక్కువ నామ్‌కీన్‌ను నింపుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications