Mukesh Ambani: అంబానీ కొత్త ఎత్తుగడ.. రూ.40 వేల కోట్ల బిజినెస్ ప్లాన్.. పూర్తి వివరాలు..
Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ పగ్గాలు చేపడుతున్నారు. వారసులను రంగంలోకి దించిన ఆయన తాజాగా అతిపెద్ద ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు.
అంబానీ స్థాపించిన రిలయన్స్ రిటైల్ అద్భుతమైన పనితీరుతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ఉన్న ఆస్తులను మోనటైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT) ద్వారా రూ.40,000 కోట్ల వరకు నిధులను సమీకరించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను సెబీ వద్ద దాఖలు చేసినట్లు ఇండియా రిటైలింగ్ నుంచి వచ్చిన నివేదిక వెల్లడించింది.

రిలయన్స్ రిటైల్ InvIT రానున్న రెండు నెలల్లో ప్రారంభంలో సుమారు రూ.400 కోట్లను సమీకరించనుందని అంతర్గత సమాచారం. మొదటి రౌండ్ నిధులు ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తాయని వెల్లడైంది. అంబానీకి చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2.4-3 బిలియన్ డాలర్లను ట్రస్ట్‌తో రిటైల్ వేర్‌హౌసింగ్ ఆస్తులను మోనటైజ్ చేయడానికి సిద్ధమవుతోందని ఈ ఏడాది ఏప్రిల్ నుంచే వార్తలు వస్తున్నాయి.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ చివరికి రూ.25,000-40,000 కోట్ల వరకు నిధులను సేకరిస్తుంది. అయితే ఇది నాలుగో త్రైమాసికం నాటికి జరగవచ్చని విషయం తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. ఇటీవల రిలయన్స్ రిటైల్ ఇతర కీలకమైన అంబానీ సంస్థలను అధిగమించి 112 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ నివేదించింది. రిలయన్స్ రిటైల్ విభాగం ఇటీవలి నెలల్లో ఆఫ్‌లైన్ సెగ్మెంట్‌లో భారీగా విస్తరిస్తోంది.


Click it and Unblock the Notifications