Jio ఫైనాన్షియల్ సర్వీసెస్: ఇందుగలను అందులేను అన్నట్లుగా ప్రతి వ్యాపారంలోకి ప్రస్తుతం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రవేశిస్తున్నారు. ఆసియాలోని వ్యాపార దిగ్గజం ఇటీవల ఫైనాన్షియల్ రంగంలోకి అడుగుపెట్టన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆసియాలో సంపన్నుడిగా కొనసాగుతున్న అంబానీ ఆన్‌లైన్ రిటైల్, ఫైనాన్షియల్ రంగాల్లో తన కంపెనీ వ్యాపార ప్రయోజనాలను విస్తరించడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే భారతదేశపు రూ.1.33 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. దీనిలో భాగంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు రిలయన్స్ గ్రూప్ పెద్ద అడుగు వేస్తోంది.

దేశీయ రూపే నెట్‌వర్క్‌లో రెండు క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు రిలయన్స్ భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)తో చేతులు కలిపింది. 'రిలయన్స్ SBI కార్డ్' పేరుతో ఇవి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఇవి రిలయన్స్ కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రయోజనాలను ఈ కార్డులు అందిస్తాయి. వీటిలో రిలయన్స్ రిటైల్ కోసం వోచర్‌లు.. అలాగే రిలయన్స్ గ్రూప్‌లోని JioMart, Ajio, అర్బన్ లాడర్, ట్రెండ్స్‌పై డిస్కౌంట్స్ అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం దేశంలో వెస్ట్రన్ క్రెడిట్ కార్డ్ వినియోగం కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. గత ఏడాది దేశంలో డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లు రూ.53,000 కోట్ల విలువైనవి జరగగా.. క్రెడిట్ కార్డు చెల్లింపులు ఏకంగా రూ.1,33,000 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ఇంతపెద్ద క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని రిలయన్స్ అధినేత నిర్ణయించారు. ఈక్రమంలోనే Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా డెబిట్ కార్డ్ ఆఫర్లతో ముందుకు రావాలని ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications