Mukesh Ambani: ఆ కంపెనీలో వాటా కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్.. పూర్తి వివరాలు..!!
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ కొనుగోలుకు అనుమతులు పొందిన వేళ స్టీమింగ్ రంగంపై అంబానీ దృష్టి మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే మరో పెద్ద కొనుగోలుకు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అవును ముఖేష్ అంబానీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ కంపెనీలో కీలక వాటాదారుగా మారాలని చూస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. స్టేక్ కొనుగోలుకు ఇప్పటికే చర్చలు మెుదలయ్యాయని తెలుస్తోంది. దర్శకుడు కరణ్ జోహార్ సంస్థ పూర్ & సన్స్, యే జవానీ హై దీవానీ, కల్ హో నా హో, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటెంట్ ప్రొడక్షన్ వ్యాపారంలో ముందుకు వెళ్లేందుకు ఈ వాటాల కొనుగోలుకు దిగుతోందని తెలుస్తోంది. అయితే డీల్ పరిమాణం ఎంత అనే వివరాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు.

ధర్మా ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ప్రస్తుతం 90 శాతానికి పైగా వాటాలను హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన 9.24 శాతం వాటాను ఆమె తల్లి హిరూ జోహార్ కలిగి ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన తన వాటాలను లిక్విడేట్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. వ్యాల్యుయేషన్ విభేదాలతో గతంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనారిటీ వాటా విక్రయానికి సంజీవ్ గోయెంకా మద్దతు ఉన్న సరేగామాతో ధర్మా ముందుగా చర్చలు జరిపింది. హిందీ చిత్ర పరిశ్రమలో హిట్స్ సంఖ్య తగ్గటంతో అనుకున్న స్థాయిలో విలువ లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు మారిపోవటంతో థియేటర్‌లలో ఫుట్‌ఫాల్స్ దెబ్బతినడంతో సినిమా నిర్మాణ ఖర్చులు కూడా పెరిగాయి.
అయితే రిలయన్స్ కంటెంట్ ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం జియో స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, కొలోస్సియం మీడియా అండ్ బాలాజీలో మైనారిటీ వాటాలు ఉన్నాయి. అంబానీ నేతృత్వంలో కొనసాగుతున్న జియో స్టూడియోస్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోలలో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. FY23లో ధర్మ ప్రొడక్షన్స్ ఆదాయం రూ.1,040 కోట్లుగా ఉంది. ఇది దాదాపు నాలుగు రెట్లు పెరుగుదల.
అంతకు ముందు ఏడాది ఆదాయం కేవలం రూ.276 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో నికర లాభం 59 శాతం పడిపోయింది. సినిమా నిర్మాణంలో ఉన్న ఇబ్బందులపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జోహార్ తన బాల్యంలో కొన్నిసార్లు నష్టాల నుంచి కోలుకోవడానికి, ఫైనాన్షియర్‌లకు తిరిగి డబ్బు చెల్లించడానికి వారు ఆస్తులు, ఆభరణాలను అమ్మేసిన సందర్భాలను సైతం గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications