Mukesh Ambani: విధ్వంసానికి ముఖేష్ అంబానీ సిద్ధం.. టీమ్ ముత్తయ్య మురళీధరన్ రంగంలోకి..!!
Spinner Sports Drink: ముఖేష్ అంబానీ ఆయిల్ నుంచి రిటైల్ వరకు అన్ని వ్యాపారాల్లోనూ తన యుద్ధాన్ని ప్రస్తుతం స్టార్ట్ చేశారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి దూకుడు బెంచిన అంబానీ దానికి తగినట్లుగానే కొత్త టీమ్ తో మెగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో అంబానీ సంస్థ రిలయన్స్ కన్జూమర్ శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌తో జతకట్టింది. ఈ క్రమంలో అంబానీ ప్రస్తుతం దేశంలోని స్పోర్ట్స్ డ్రింగ్ మార్కెట్లను టార్గెట్ చేశారు. ఇందుకోసం కొత్తగా స్పిన్నర్ పేరుతో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ముఖేష్ ఇప్పటికే తన క్యాంపా కోలాతో దేశంలోని శీతలపానీయాల మార్కెట్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన స్పోర్ట్స్ డ్రింక్స్ కేటగిరీని టార్గెట్ చేయటం కొత్త యుద్ధానికి దారితీయనుందని తెలుస్తోంది.

ఏ వ్యాపారంలో అయిన తనదైన తెలివిని ప్రదర్శించే అంబానీ ఈసారి కూడా స్పోర్ట్స్ డ్రింక్స్ బిజినెస్ లోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక స్పోర్ట్స్ డ్రింక్స్ ఖరీదైనవిగా ఉండగా.. అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటు ధరలోకి తీసుకురావాలని సూచించారు. ఇక్కడ ముత్తయ్య మురళీధరన్ ని అంబానీ ఎంచుకోవటానికి వెనుక కొన్ని కీలక అంశాలు దాగి ఉన్నాయి. అదేంటంటే ఆయన క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత వ్యాపారవేత్తగా మారటమే. శీతలపానీయాల వ్యాపారంలో కూడా ఉండటంతో అంబానీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
స్పిన్నర్ పేరుతో విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ డ్రింక్ మైసూర్‌లోని ముత్తయ్య బేవరేజెస్ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు సమాచారం. ముత్తయ్య కంపెనీ ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో కాంపా ఉత్పత్తులను బాటిలింగ్ చేసేందుకు రిలయన్స్ కన్జూమర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక రేటు విషయానికి వస్తే 150 ఎంఎల్ స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్ కేవలం రూ.10కి విక్రయించాలని అంబానీ నిర్ణయించారు. దీనిని చూస్తుంటే అంబానీ పెద్ద సవారీకే సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
ఈ వేసవి నాటికి దేశవ్యాప్తంగా స్పిన్నర్ ఉత్పత్తి రిటైలింగ్ స్టార్ట్ చేయటం ద్వారా ప్రజలకు దీనిని అందుబాటులోకి తీసుకురావాలని అంబానీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్ట్రింగ్, రెడ్ బుల్ వంటి ప్రముఖ ఎనర్జీ డ్రింకులకు పోటీగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో స్పోర్ట్స్ డ్రింక్ వ్యాపార విలువ దాదాపు రూ.250 కోట్లుగా ఉంది. అయితే తక్కువ ధరల ద్వారా పోటీ ఇవ్వటంతో ఈ కేటగిరీలో అధిక వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని అంబానీ ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పెప్సికో, కోకా-కోలా విక్రయించే గేటోరేడ్, పవర్‌రేడ్ వంటి బ్రాండ్‌ల కంటే స్పిన్నర్ చాలా సరసమైన ధరకి అందుబాటులోకి రాబోతోంది.


Click it and Unblock the Notifications