Mukesh Ambani on Reliance Jio: నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద రిస్క్ రిలయన్స్ జియో అంటూ అధినేత ముఖష్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెకిన్సే గౌతమ్ కుమార్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిలయన్స్ భవిష్యత్తు ప్రణాళికలతో పాటు దార్శనికతకు సంబంధించిన పలు అంశాలను ఈ చర్చలో పంచుకున్నారు అంబానీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జియోలో కంపెనీ చేసిన 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి భారతదేశాన్ని డిజిటలైజ్ చేయడానికి నేను చేసిన తాపత్రయంతో కూడిన రిస్క్ అని చెప్పుకొచ్చారు. దీని మీద మొదట్లో ఆర్థిక రాబడి అంచనా లేకపోయినా అది చాలా విలువైనదని ముఖేష్ అంబానీ అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్, క్లీన్ ఎనర్జీ పర్యావరణ వ్యవస్థను త్వరలో నిర్మిస్తున్నానని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ తెలిపారు. సంపద సృష్టి, ఆవిష్కరణతో పాటుగా దేశం కోసం లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావడమే వ్యాపార లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సౌర, బ్యాటరీ, హైడ్రోజన్, బయో ఎనర్జీ కోసం కంపెనీ పెద్ద ప్రణాళికలను కలిగి ఉందన్నారు. మారుతున్న వాతావరణం నుండి భూమిని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం రిలయన్స్ ఎప్పుడూ ముందడుగు వేస్తుందని చెప్పుకొచ్చారు.

ఇంకా మాట్లాడుతూ..ఆలోచన బలంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పుకొచ్చారు. 100 సంవత్సరాల తర్వాత కూడా రిల్ దేశానికి, ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక.వ్యాపారం కేవలం లాభాల మూలం మాత్రమే కాదు, సమాజంలో మార్పుకు పెద్ద సాధనం కావాలని పిలుపునిచ్చారు. కాగా 2027 నాటికి రిలయన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మీరు మీ జీవితంలో అతిపెద్ద రిస్క్‌ను ఎదుర్కోవడానికి సిద్ధం కావడం అతిపెద్ద బలమని చెప్పుకొచ్చారు అంబానీ.
ఆయన జీవితంలో చేసిన రిస్క్ గురించి మాట్లాడుతూ.. రిలయన్స్ జియోని ప్రారంభించడం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద రిస్క్ అని చెప్పుకొచ్చారు. నా సొంత డబ్బును మొత్తం అందులో పెట్టుబడి పెట్టి దానిని ప్రారంభించాను. అది సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలియదు..అయినా రిస్క్ చేసి ప్రయత్నించాను. అయితే నేను చేసిన ఈ అతిపెద్ద రిస్క్ నేడు అతిపెద్ద విజయంగా మారింది. భారతదేశ డిజిటల్ విప్లవానికి నేను చేసిన రిస్క్ నాందిగా నిలిచిందని తెలిపారు ముఖేష్ అంబానీ.
జీవిత సారాంశం గురించి అంబానీ మాట్లాడుతూ.. అందరూ ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వస్తారు..అలాగే ఏమీ లేకుండా పోతారని నమ్ముతారు అయితే నేను మాత్రం ఒక సంస్థను వదిలి వెళతానని చెప్పుకొచ్చారు. 'రిలయన్స్ అనేది ఒక ప్రక్రియ. ఇది మనుగడ సాగించాల్సిన సంస్థ అని నా తండ్రి నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. నా తండ్రి తరువాత నేను నా తరువాత నా వారసులు ఈ సంస్థ మనుగడ సాగించేలా చూసుకోవాలనేది నా కోరిక అని చెప్పుకొచ్చారు.
జియో 2016లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతోనే ఉచిత డేటా, వాయిస్ కాల్‌లతో టెలికం ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించింది. కేవలం కొద్ది రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా యూజర్లతో మిగతా టెలికం కంపెనీలకు సవాల్ విసిరింది. 2024 నాటికి 470 మిలియన్లకు పైగా వినియోగదారులు జియోకు ఉన్నారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెలిపింది.
జూన్ 2025 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా వినియోగదారుగా భారత్ నిలవగా..దీనికి జియో పునాది రాయిగా నిలిచింది. ప్రస్తుతం జియోలో ఫేస్‌బుక్, గూగుల్, సిల్వర్ లేక్, KKR వంటి సంస్థలు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులతో కంపెనీ విలువ 65 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications