అమెరికా మార్కెట్ ఎఫెక్ట్, పడిపోయిన ముఖేష్ అంబానీ ర్యాంక్!

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నాలుగో స్థానానికి ఎగబాకగా, ఆగస్ట్ 8న 4వ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 78.8 బిలియన్ డాలర్ల సంపదతో ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ సంపద 84.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ అర్నాల్డ్‌ను కూడా వెనక్కి నెట్టాడు మస్క్. ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌కు 15 బిలియన్ డాలర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇటీవలే జుకర్ బర్గ్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాడు.

వాల్ స్ట్రీట్ జూమ్.. పెరిగిన బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద

వాల్ స్ట్రీట్ జూమ్.. పెరిగిన బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద

వాల్ స్ట్రీట్ ర్యాలీ సాధించడంతో టెస్లాకు చెందిన ఎలాన్ మస్క్, బెర్నార్డ్ అర్నాల్డ్ నికర వ్యాల్యూ భారీగా పెరిగింది. దీంతో వీరు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఈ నెల ప్రారంభంలో ముఖేష్ ఆస్తులు 80.2 బిలియన్ డాలర్లకు (రూ.6.04 లక్షల కోట్లకు పైగా) చేరుకొని బెర్నార్డ్ అర్నాల్ట్, ఇతరులను వెనక్కి నెట్టారు. అప్పుడు అర్నాల్డ్ సంపద రూ.6.01 లక్షల కోట్లుగా ఉంది. 1.24 బిలియన్ డాలర్లు తగ్గడంతో ఐదో స్థానానికి పడిపోయారు. ఇప్పుడు పెరిగి తిరిగి నాలుగో స్థానంలోకి వచ్చారు.

ముఖేష్ ఆస్తులు కొద్ది నెలల్లో 22 బిలియన్ డాలర్లు పెరిగాయి

ముఖేష్ ఆస్తులు కొద్ది నెలల్లో 22 బిలియన్ డాలర్లు పెరిగాయి

గత మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించడం లేదు. ముఖేష్ అంబానీ సంపద కాస్త కరిగిపోయింది. మార్చి నెలలో షేర్ ధర 52 వారాల కనిష్టం రూ.867.43 నుండి ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువగా ఎగిసింది. దీంతో జనవరి నుండి ముఖేష్ అంబానీ ఏకంగా బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో 10 ర్యాంకుల కంటే ఎగబాకారు. ఈ కాలంలో అతని నికర వ్యాల్యూ 22 బిలియన్ డాలర్లు పెరిగింది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ వంటి వివిధ మార్గాల్లో పెద్ద మొత్తంలో నిధులు సమీకరించారు. టాప్ 10 ప్రపంచ కుబేరుల్లో ఆసియా నుండి ఉన్న ఏకైక వ్యక్తి ముఖేష్. ఎనిమిది మంది అమెరికాకు చెందిన వారు, ఒకరు ఫ్రాన్స్‌కు చెందినవారు.

భారత్ టాప్ 10 కుబేరులు

భారత్ టాప్ 10 కుబేరులు

బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ 78.3 బిలియన్ డాలర్లతో ప్రపంచ ధనవంతుల్లో 6వ స్థానంలో నిలిచారు. భారత్, ఆసియాలోనే అత్యంత ధనవంతులు.

హెచ్‌సీఎల్ టెక్ శివనాడార్ 78 బిలియన్ డాలర్లతో 78వ స్థానంలో, రాధాకిషన్ ధమాని 15.3 బిలియన్ డాలర్లతో 106వ స్థానంలో, గౌతమ్ అదానీ 13.7 బిలియన్ డాలర్లతో 132వ స్థానంలో, సైరస్ పూనావాలా 11.8 బిలియన్ డాలర్లతో 152వ స్థానంలో, ఉదయ్ కొటక్ 11.3 బిలియన్ డాలర్లతో 156వ స్థానంలో, సునీల్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ 10.2 బిలియన్ డాలర్లతో 182వ స్థానంలో, లక్ష్మీ మిట్టల్ 9.7 బిలియన్ డాలర్లతో 192వ స్థానంలో, దిలీప్ శాంగ్వీ 8.9 బిలియన్ డాలర్లతో 207వ స్థానంలో, కుమార్ బిర్లా 8.8 బిలియన్ డాలర్లతో 210వ స్థానంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+