Mukesh Ambani: కోకాకోలాను ఢీ కొడుతున్న అంబానీ.. దీపావళి నాటికి మార్కెట్లోకి కొత్త బ్రాండ్..
Mukesh Ambani: వ్యాపార విస్తరణలో ముఖేష్ అంబానీ చాలా స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కోలా మార్కెట్లో భారీ మార్పులు జరగనున్నాయి. ఎందుకంటే ఈ రంగంలో ప్రవేశించేందుకు సిద్ధమౌతున్నారు.

తిరిగి భారత మార్కెట్లోకి..
శీతల పానీయాల బ్రాండ్ కాంపా ఒకప్పుడు దాని కాంపా కోలాతో మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇది మార్కెట్లోకి మళ్లీ తిరిగి రానుంది. ఎందుకంటే.. ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్ గ్రూప్‌తో సుమారు రూ.22 కోట్లకు రిలయన్స్ ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది.
దీంతో 1977లో కోకాకోలా ఇండియా నుంచి వెళ్లిపోవడంతో ఆ కొరతను తీర్చిన కాంపా కోలా ఇప్పుడు మళ్లీ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. 1949లో కోకాకోలాను భారత శీతల పానీయాల మార్కెట్‌కు తీసుకొచ్చిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్.. 1970లలో కాంపా కోలాను ప్రారంభించింది. దీపావళికి దీన్ని భారత మార్కెట్లో తిరిగి లాంచ్ చేసేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది.

FMCG వ్యాపారాన్ని పెంచే ప్లాన్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన FMCG వ్యాపారాన్ని మరింతగా పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ శీతల పానీయాల బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేసింది. బ్రాండ్ ఒకప్పుడు దాని కోలా వేరియంట్ కాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది. ఇప్పుడు రిలయన్స్ దానిని తిరిగి మార్కెట్లోకి తీసుకురావటం ద్వారా మళ్లీ మార్కెట్లో వాటాను హస్తగతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కాంపా కోలా రాకతో మార్కెట్లో పెద్ద మార్పులు రానున్నాయి.

త్వరలోనే ధరల యుద్ధం..
రిలయన్స్ ఇప్పుడు ఈ డీల్‌తో కోలా మార్కెట్‌లోని కోకా-కోలా, పెప్సీకోలకు పోటీ ఇవ్వనుంది. లెమన్, ఆరెంజ్, కోలా అనే మూడు ఫ్లేవర్లలో కాంపా కోలాను విడుదల చేసేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయత్నం వల్ల కంపెనీల మధ్య ధరల యుద్ధం ప్రారంభంకానుంది. మొదటి దశలో రిలయన్స్ తన రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, కిరాణా స్టోర్లలో వీటి అమ్మకాలను జరపనుంది. కాంపాను కొనుగోలు చేయడం అనేది ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రిలయన్స్ వ్యూహంలో భాగమని నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ దేశంలో తన నెట్‌వర్క్‌ను పెంచుకోబోతోంది. B2B నెట్‌వర్క్ ద్వారా 15 లక్షలకు పైగా కిరాణా దుకాణాలను ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నాయి.

కాంపా కోలా చరిత్ర..
1977లో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత కొంత కాలానికి పరిశ్రమల మంత్రిత్వ శాఖ బాధ్యతలు జార్జ్ ఫెర్నాండెజ్ అన్ని విదేశీ కంపెనీలకు నోటీసులు అందించారు. తమ ఉత్పత్తి రహస్యాన్ని వెల్లడించకూడదని నిర్ణయించుకున్న కోకాకోలా భారత మార్కెట్ ను విడిచి వెళ్లిపోయింది. ఆ తరువాత ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ కాంపా కోలాను ప్రవేశపెట్టింది. మార్కెట్లో విదేశీ కంపెనీల పోటీ లేకపోవటంతో అది లీడర్ గా ఎదిగింది.


Click it and Unblock the Notifications