Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ఆసియాలోనే సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన వ్యాపారాన్ని కొత్త రంగాల్లోకి విస్తరిస్తున్నారు. జియోతో టెలికాం రంగంలో పెద్ద ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మరో రంగంలో టాప్ ప్లేయర్ అయ్యేందుకు కిల్లింగ్ గేమ్ ప్రారంభించారు అంబానీ.
ఇప్పటికే జియోతో దేశంలోని మెుబైల్ యూజర్లకు దగ్గరవటంతో పాటు.. ఫైబర్ సేవలతో సగటు మధ్యతరగతి కుటుంబంలో ఇంటర్నెట్ వెలుగులు నింపాడు. తక్కువ ధరలకే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి కోట్ల మందిని ఆకట్టుకున్న అంబానీ సరిగ్గా అదే ప్రణాళికను కూల్ డ్రింక్స్ వ్యాపారంలో కూడా తిరిగి రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ మెుత్తం ఆస్తుల విలువ దాదాపు 16.48 లక్షల కోట్లుగా ఉంది. బెవెరేజెస్ మార్కెట్లో ఇతర ఆటగాళ్లను పద్మవ్యూహంలోకి నెట్టి ఏకచత్రాధిపత్యాన్ని సాధించాలని చూస్తున్నారు.

భారతీయ సంప్రదాయం, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రజల టేస్టులకు తగ్గట్లుగా సరికొత్త కూల్ డ్రింక్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది రిలయన్స్. ఈ క్రమంలోనే రానున్న సమ్మర్ సీజన్ కోసం కంపెనీ ఇప్పటి నుంచే ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ "రాస్ కిక్" గ్లూకో ఎనర్జీ అనే పేరుతో కొత్త బెవరేజ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ప్రధానంగా మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తూ కేవలం రూ.10 ధరకు విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే క్యాపా కోలా ఉత్పత్తులతో మార్కెట్లో వ్యాపారాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్న అంబానీ ఈసారి దానిని మరింతగా విస్తృతం చేయాలని చూస్తున్నారు.
కొత్తగా తీసుకొస్తున్న రాస్ కిక్ బ్రాండ్ ద్వారా ఇప్పటికే ఉన్న కూల్ డ్రింక్స్‌తో పాటు జ్యూస్‌లనూ అందించనునున్నట్లు రిలయన్స్ ఇప్పటికే ప్రకటించటం గమనార్హం. అయితే ప్రస్తుతం తీసుకొస్తున్న డ్రింక్ టాటాలకు చెందిన గ్లూకో ప్లస్ కు గట్టి పోటీని అందించనుందని తెలుస్తోంది. దేశంలో విస్తారమైన రిటైల్ వ్యాపారం తన చేతిలో కలిగి ఉన్న రిలయన్స్ రిటైల్ తన ఉత్పత్తిని విస్తృతంగా మార్కెటింగ్ చేయటం ద్వారా టాటాలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విదేశీ సంస్థలైన కోకాకోలా, పెల్సికోలకు క్యాపాతో పోటీని ఇస్తుండగా ప్రస్తుతం దేశీయ ఆటగాళ్లకు కూడా సవాలు విసిరే పనిలో రిలయన్స్ ఉంది.
"రాస్ కిక్"లో భారతీయ సంప్రదాయ టేస్టులకు తగ్గట్లుగా.. ప్రస్తుతం మ్యాంగో, ఆపిల్, మిక్స్ డ్ ఫ్రూట్, కొకోనట్ వాటర్, నింబూ పానీ వంటి రుచులతో ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇది రానున్న కాలంలో భారతీయ కూల్ డ్రింక్ ఫ్యాన్స్ కు 'కిక్' ఇస్తుందనడంలో సందేహమే లేదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications