Jio Financial: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎవ్వరి నోట విన్నా పేటీఎం కంపెనీ షేర్లు, ప్రస్తుతం కంపెనీపై కొనసాగుతున్న ఆంక్షల గురించే ప్రస్థావన కొనసాగుతోంది. ఈ క్రమంలో పేటీఎం వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్స్ ప్రయత్నిస్తోందనే వార్తలు వైరల్ అయ్యాయి.
గత ఏడాది మాతృసంస్థ రిలయన్స్ నుంచి ప్రత్యేక వ్యాపారంగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీమెర్జ్ అయిన సంగతి తెలిసింది. దీంతో కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్లలో జాబితా చేయబడింది. చాలా కాలంగా దేశంలోని ఫైనాన్స్ వ్యాపారంపై ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పేటీఎం మాతృ సంస్థ One 97 కమ్యూనికేషన్స్ వాలెట్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చర్చలు జరుపుతోందంటూ వచ్చిన మీడియా కథనాలను జియో సంస్థ ఖండించింది.

ఇవన్నీ కేవలం మీడియా ఊహాగానాలేనంటూ కంపెనీ క్లారిటీ ఇచ్చిందే. ఇదే విషయాన్ని సోమవారం రాత్రి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో JFSL పేర్కొంది. వైరల్ అవుతున్న ఈ వార్త కేవలం ఊహాజనితమని, ఈ విషయంలో తాము ఎటువంటి చర్చలు జరపలేదంటూ స్పష్టం చేసింది. వాస్తవానికి సంభావ్య కొనుగోలుపై క్లారిటీ ఇవ్వాలంటూ బీఎస్ఈ జియో ఫైనాన్షియల్స్ కంపెనీని కోరిన తర్వాత వచ్చిన సమాచారంతో స్పష్టత వచ్చింది.
దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో పేటీఎం వ్యాపార కొనుగోలుకు అంబానీ చర్చలంటూ వచ్చిన వార్తా కధనాలతో జియో ఫైనాన్షియల్ షేర్ ధరను దాదాపు 14 శాతం మేర పెంచేశాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29, 2024 నుంచి కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయకుండా లేదా కీలక ఆర్థిక లావాదేవీలను నిర్వహించకుండా పరిమితం చేయబడింది.
అంబానీ సంస్థ నుంచి కొనుగోలు వ్యవహారం కేవలం పుకార్లే అంటూ వచ్చిన క్లారిటీ కారణంగా నేడు ఉదయం 10.40 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో జియో ఫైనాన్షియల్స్ స్టాక్ ధర 4 శాతానికి పైగా క్షీణించి రూ.277.70 వద్ద కొనసాగుతోంది. దీనిపై పేటీఎం సైతం స్పందిస్తూ అలాంటి చర్యలు జరగలేదని వెల్లడించింది.


Click it and Unblock the Notifications