Mukesh Ambani: టాప్ 15 స్టార్టప్ కంపెనీల్లో అంబానీ పెట్టుబడి.. వ్యాపారం ఒడిసిపట్టేందుకే..??
Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. మారుతున్న టెక్నాలజీ, వ్యాపార విపణిలో తాను వెనకపడకుండా టాప్ స్టార్టప్ కంపెనీలను వెతికి పెట్టుబడులు పెడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ముందుకు తీసుకెళుతున్నారు.
స్టానిక స్టార్టప్ కంపెనీల్లో వేల కోట్లు పెట్టుబడిగా పెడుతున్నారు. ముందుగా కిరాణా డెలివరీ యాప్ డన్జోలో రూ.1,490 కోట్ల పెట్టుబడితో 25.8% వాటాను దక్కించుకున్నారు. అలాగే ఆన్‌లైన్ మందుల వ్యాపారంలో ఉన్న నెట్‌మెడ్స్ కంపెనీని స్వాధీనం చేసుకోగా.. రూ.620 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆగస్టు 2020లో మెజారిటీ Vitalicని కొనుగోలు చేసింది. అలాగే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆస్టెరియా అనే రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్‌ల తయారీ కంపెనీలో 51.78% వాటాలను రూ.23.12 కోట్లకు కొనుగోలు చేసింది.

అలాగే ఏఐ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ Embibeలో సుమారు రూ.1,340 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. అలాగే హైదరాబాద్ ఆధారిత దేశీయ SaaS స్టార్టప్ NowFloats టెక్నాలజీస్‌ను 2019లో రూ.141 కోట్లకు కొనుగోలు చేసింది. ఇలాగే గ్లోబల్ రోబోటిక్స్ కంపెనీ యాడ్‌వెర్బ్ స్టార్టప్ కంపెనీని రిలయన్స్ రిటైల్ 4132 మిలియన్లకు కొనుగోలు చేసింది.ఇది ఇంట్రాలాజిస్టిక్స్ ఆటోమేషన్ రంగంలో పని చేస్తోంది. ఓపెన్ టెలికాం ప్లాట్‌ఫారమ్ సొల్యూషన్‌ల Radisys పేరుతో జూన్ 2018లో 74 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది.
మహిళల లోదుస్తుల బ్రాండ్ క్లోవియాను రూ.950 కోట్లకు కొనుగోలు చేసింది. రిటైల్ వ్యాపారాలు వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడే Fynd కంపెనీలో రూ.190 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ జియో డిజిటల్ సర్వీసెస్ సంభాషణ AI ప్లాట్‌ఫారమ్ అయిన Haptik Infotech Pvt Ltd రూ.700 కోట్లకు డీల్ జరిగింది. స్థానిక భాషా సాంకేతికతను అందించే రెవెరీని రూ.190 కోట్లతో మెజారిటీ వాటాలను సొంతం చేసుకుంది.
ముంబైకి చెందిన హైపర్-లోకల్ లాజిస్టిక్స్ స్టార్టప్ గ్రాబ్ సర్వీసులో 83% వాటా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.146 కోట్లు చెల్లించింది. సాఫ్ట్‌వేర్ కంపెనీ సి-స్క్వేర్‌లో రిలయన్స్ దాదాపు 82% ఈక్విటీ క్యాపిటల కోసం రూ.82 కోట్లను చెల్లించింది. ఈ-లెర్నింగ్ వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసే బెంగళూరుకు చెందిన ఫన్‌టూట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 90.5% వాటాను రూ.71.64 కోట్లకు కొనుగోలు చేసింది. చివరగా 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ కనెక్షన్ అందించే మిమోసా నెట్‌వర్క్స్ ను జియో రాడిసిస్ కార్పొరేషన్ ద్వారా 60 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications