Mukesh Ambani: కిషోర్ బియానికి చెందిన ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రుణ భారంతో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే దీని దివాలా ప్రక్రియలో పాల్గొనేందుకు ముఖేష్ అంబానీ ముందుకొచ్చారు.
వ్యాపారాన్ని దక్కించుకునే రేసులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్, జిందాల్ లిమిటెడ్, డోనార్ ఇండస్ట్రీస్ యాజమాన్యలోని GBTL లిమిటెడ్ పోటీలో నిలిచాయి. ఫిబ్రవరి 27న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కంపెనీ దివాలాకు అంగీకారం తెలిపింది. ముంబై బెంచ్ కార్పోరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభానికి ఆదేశాలు జారీ చేసింది. బకాయిలను తిరిగి పొందేందుకు వేలం జరుగుతోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రిజల్యూషన్ ప్రొఫెషనల్ అవిల్ మెనెజెస్ కొనసాగుతున్నారు.

రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతల నుంచి రూ.12,265 కోట్ల ధృవీకరించబడిన క్లెయిమ్‌లను, ఫిక్స్‌డ్ డిపాజిట్ హోల్డర్ల నుంచి రూ.23 కోట్ల క్లెయిమ్‌లను అంగీకరించింది. అలాగే బాండ్ల రూపంలో ఫ్యూచర్ గ్రూప్ భారీగా రుణాలను కలిగి ఉంది. సెంట్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అత్యధికంగా రూ. 3,344 కోట్లు, యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్ రూ. 1,341 కోట్లు, విస్ట్రా ఐటీసీఎల్ (ఇండియా) రూ. 210 కోట్లతో క్లెయిమ్‌ను దాఖలు చేశాయి. ఉద్యోగులకు రూ.2.58 కోట్లు, పన్ను జీఎస్టీ అధిరులకు రూ.14.75 కోట్లను చెల్లించాల్సి ఉంది.
కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ గత కొన్ని నెలలుగా అనేక చెల్లింపులను డిఫాల్ట్ చేసింది. తాజాగా రూ.120 కోట్ల మెుత్తానికి జారీ చేసిన సెక్యూరిటీలపై చెల్లించాల్సిన వడ్డీని డిఫాల్ట్ చేసింది. ఈ నెల ప్రారంభంలో రూ.29 కోట్ల నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల కోసం రూ.1.41 కోట్ల వడ్డీని చెల్లించడంలో డిఫాల్ట్ అయింది. బియానీ నియంత్రణలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల్లో నాలుగు దివాలా ప్రక్రియలో ఉన్నాయి.
కరోనా కాలంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా కంపెనీ వ్యాపారం భారీగా దెబ్బతింది. అలాగే ఈ-కామర్స్ దిగ్గజం Amazon.com కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వేసిన వరుస వ్యాజ్యలతో రిలయన్స్ ఒప్పందం దెబ్బతింది. చివరికి మార్చి 2022లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అద్దె చెల్లించడం లేదని పేర్కొంటూ 900 ఫ్యూచర్ రిటైల్ స్టోర్‌లను స్వాధీనం చేసుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications