Hathway Cable Stock: దేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం, ఆసియాలోనే సంపన్నుడిగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీకి చెందిన కొన్ని వ్యాపార సంస్థల షేర్లు పెన్నీ స్టాక్ కేటగిరీలోనే ఉన్నాయి. ఇవి చాలా మంది పెట్టుబడిదారులకు అందుబాటు ధరల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటిలో పెద్ద కొనుగోలు రద్దీ కొనసాగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది హాత్వే కేబుల్స్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. పెన్నీ కేటగిరీ కింద ఉన్న కంపెనీ షేర్ల ధర ప్రస్తుతం రూ.20 కంటే తక్కువ రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. వారాంతంలో చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం నాడు కంపెనీ షేర్ ధర రూ.20.83గా ఉంది. ఇది అందుకు ముందు రోజు కంటే 1.66 శాతం లాభపడింది. కంపెనీ షేర్లు ఫిబ్రవరి 2024లో ఒక్కో షేరు ధర రూ.27.90 వద్ద ఉన్నాయి. ఇది కంపెనీ 52 వారాల షేర్ గరిష్ఠ ధర కాగా.. 52 వారాల కనిష్ఠ షేర్ ధర రూ.13.10గా ఉంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసిన కంపెనీ.. Hathway Cable & Datacom మార్చి త్రైమాసికంలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా ఉండగా, మిగిలిన 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉన్నట్లు వెల్లడైంది. కంపెనీ ప్రమోటర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వెంచర్- జియో కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జియో ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జియో కేబుల్ & బ్రాడ్‌బ్యాండ్ హోల్డింగ్ ఉన్నాయి.
జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్ రూ.34.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే గత ఏడాది ఇదే మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.14.62 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2024 మార్చి త్రైమాసికంలో కేబుల్ టెలివిజన్ విభాగం నుంచి కంపెనీ ఆదాయం రూ.330.62 కోట్లు, బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారం నుంచి రూ.153.85 కోట్లు, సెక్యూరిటీలలో లావాదేవీల ద్వారా రూ.8.90 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది.
కంపెనీ ఏడాది ప్రాతిపదికన నష్టాల నుంచి లాభాల్లోకి రావటంతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7.35% పెరిగి రూ.493.37 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో వార్షిక ప్రాతిపదికన మెుత్తం ఖర్చులు 1.86% పెరిగి రూ.493.52కి చేరాయి. కంపెనీ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద బహుళ-వ్యవస్థ ఆపరేటర్లు, కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications