Mukesh Ambani: దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీకి రోజురోజుకూ బెదిరింపులు పెరిగిపోతున్నాయి. ఏకంగా ఆయనకే దుండగులు ఈమెయిల్ పంపే సాహసం చేయటం ప్రస్తుతం ఆర్థిక రాజధాని ముంబైలో పెద్ద చర్చకు దారితీసింది.
నిన్న అంబానీని చంపేస్తామని బెదిరిస్తూ కొందరు దుండగులు మెయిల్ పంపారు. అందులో తమకు రూ.20 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద అత్యుత్తమ షార్ట్ షూటర్లు ఉన్నారని.. చంపకుండా వదిలేయాలంటే తాము డిమాండ్ చేసిన మెుత్తాన్ని చెల్లించాలని వారు సూచించారు. దీంతో అంబానీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో గాదేవి పోలీసులు IPC సెక్షన్ 387, 506(2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే రెండోసారి అంబానీ బెదిరింపులు అందుకోవటం పోలీసులకు పెద్ద సవాలుగా మారిపోయింది. ఈ సారి దుండగులు ఏకంగా రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో మెయిల్ పంపారు. అంబానీ లాంటి పెద్ద వ్యాపారినే బెదిరించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు..? వారి వెనుక ఎవరు ఉన్నారు..? ఇది ఎవరైనా ఆకతాయిలు చేస్తున్న పనా లేక మాఫియా గ్యాంగ్స్ ఏవైనా వారిని నడిపిస్తున్నాయా..? వంటి అనేక అనుమానాలు, ఊహాగానాలు మహారాష్ట్ర పోలీసుల ముందు ఉన్నాయి.
రెండవ సారి దుండగులు పంపిన ఈ-మెయిల్ సమాచారం ప్రకారం తాము పంపిన మెుదటి మెయిల్ కు మీరు స్పందించలేదని దుండగులు రాశారు. అందుకే ప్రాణాలు కాపాడుకోవాలంటే అంబానీ తామకు రూ.200 కోట్లు చెల్లించాలని వారు బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిని పట్టుకునే పనిలో సౌత్ ముంబై పోలీసులు జల్లెడ పడుతున్నారు. దేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్న అంబానీకి భద్రతా సమస్యల దృష్ట్యా మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంబానీ కుటుంబానికి Z+ కేటగిరీ సెక్యూరిటీని అందిస్తోంది.


Click it and Unblock the Notifications