Ambani News: దేశీయ వ్యాపారవేత్త బిలియనీర్ ముఖేష్ అంబానీకి భారీ ఊరట లభించింది. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ కి సంబంధించిన ఆరోపించిన షేర్ మానిప్యులేషన్ వ్యవహారంలో అంబానీ తాజాగా సానుకూలతను పొందారు.
వాస్తవానికి షేర్ల మానిప్యులేషన్ విషయంలో రూ.25 కోట్ల పెనాల్టీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 2009లో రిలయన్స్ ఇండస్ట్రీల్ కంపెనీలో పెట్రోలియం వ్యాపారం విలీనం అయిన సంగతి తెలిసిందే. కానీ వీటికి సంబంధించిన షేర్లలో నవంబర్ 2007లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అంబానీ సంస్థలకు తాజాగా సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు భారీ ఊరటను కలిగించింది. ఇదే విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ గతంలో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించటంతో ఇది జరిగింది.

పార్దివాలా, మహదేవన్‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత డిసెంబర్ 2న కేసును సమీక్షించేందుకు అంగీకరించారు. 'మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్‌లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు' అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆర్‌ఐఎల్, అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై రూ.70 కోట్ల పెనాల్టీలను రద్దు చేయడంపై గతేడాది డిసెంబర్ నుంచి సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆర్డర్‌ను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సవాలు చేయటంతో తాజా పరిణామాలు వచ్చాయి.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే 2007 నవంబరులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల క్యాష్ అండ్ ఫ్యూచర్స్ క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ ఉంది. ఆర్‌పీఎల్‌లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్‌ఐఎల్ నిర్ణయం తీసుకోగా.. ఆర్‌పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్‌ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, వారు షార్ట్ సెల్లింగ్ చేశారని తేలింది. అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్‌పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications