Mukesh Ambani: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యం తన పెట్టుబడిదారులకు భారీ పెట్టుబడి అవకాశాన్ని కల్పించింది. జూలై 20న రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండోసారి ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కానుండడంతో గత వారం రోజులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్మ్ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ జూలై 20న డీమెర్జ్ చేయబడి ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయబడుతోంది. రిలయన్స్ షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులందరికీ స్పిన్-ఆఫ్ కారణంగా రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 1:1 షేర్లు పొందుతారు. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు అదే సంఖ్యలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఇవ్వబడతాయి.

దాదాపుగా ఐపీవో తరహా పెట్టుబడి అవకాశం కావడంతో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల వరకు రిలయన్స్ షేర్లలోకి భారీ మొత్తాలను కుమ్మరిస్తున్నారు. అంబానీల వ్యాపారంపై నమ్మకం ఉన్న చాలా మంది ఇన్వెస్టర్లు తమ సొమ్మును పెట్టుబడిగా పెట్టేందుకు అస్సలు వెనకాడటం లేదు.. దీంతో ఒక్కసారిగా రిలయన్స్ షేర్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ కారణంగా గడచిన వారం 5 రోజుల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ మార్కెట్ విలువ రూ.69,990.57 కోట్లు పెరిగి.. మొత్తం మార్కెట్ క్యాప్ రూ.18.53 లక్షల కోట్లకు చేరుకుంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విలువ రూ.90,000 నుంచి రూ.15,000 కోట్లుగా ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ జెఫరీస్ ప్రచురించిన నివేదికలో పేర్కొంది. దీని ద్వారా ఒక్కో షేరు ధర 134-224 రూపాయల మధ్య అంచనా వేయబడింది. దీంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా అవతరించనుంది. మెుత్తాన్ని అంబానీ ఐదు రోజుల్లో భారీ మెుత్తాన్ని కొల్లగొట్టారు.


Click it and Unblock the Notifications