Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో మెుదటి 10 స్థానాల్లో చాలా కాలం ఉన్నారు భారత బిలియనీర్ ముఖేష్ అంబానీ. కానీ 2003లో ఆ స్థానానికి దూరంగా జరిగారు. కానీ తన స్థానాన్ని తిరిగి చేరిపోయారు.
కేవలం 24 గంటల సమయంలో అంబానీ నెట్ వర్త్ 2 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. దీనితో అంబానీ నికర విలువ 90 బిలియన్ డాలర్లను దాటేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ నికర విలువ రూ.19,000 కోట్లు లేదా 2.35 బిలియన్ల మేర పెరిగి 90.6 బిలియన్లకు చేరుకోవటంతో టాప్-10 బిలియనీర్‌ల జాబితాలో మరోసారి ప్రవేశించడానికి ఇప్పుడు గ్యాప్ భారీగా తగ్గింది.

భారత మార్కెట్ల వరుసగా ర్యాలీ కారణంగా ముఖేష్ అంబానీ భారీగా లాభపడటంతో ఆయన నెట్ వర్త్ పెరిగింది. ప్రస్తుతం ఆయన ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్నారు. 10వ స్థానాన్ని చేరుకోవటానికి ముగ్గురు బిలియనీర్లైన ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్, కార్లోస్ స్లిమ్, సెర్గీ బ్రిన్ లతో పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్లలో రెండవ భారతీయ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ కూడా పెరిగింది. గత 24 గంటల్లో అదానీ నికర విలువ 4.89 మిలియన్ డాలర్లు పెరిగి 60.3 బిలియన్ డాలర్లతో 21వ స్థానంలో కొనసాగుతున్నారు.
2023 ప్రారంభం నుంచి టెస్లా CEO ప్రపంచంలో నంబర్-1 సంపన్నుడైన ఎలోన్ మస్క్ సంపాదనలో ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆయన నికర విలువ 110 బిలియన్ డాలర్లు పెరిగింది. మస్క్ తర్వాత ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఏడాది ఇప్పటివరకు 58.6 బిలియన్ డాలర్లను సంపాదించారు. చాలా కాలం తర్వాత టాప్-10 బిలియనీర్ల జాబితాలోకి ప్రవేశించారు.


Click it and Unblock the Notifications