అదృష్టం ఎప్పుడు, ఎలా, ఎవరిని వరిస్తుందో చెప్పలేం.. కానీ కొన్ని సందర్భాల్లో అదృష్టం ఒక సెకనులోనే మీ జీవితాన్నే మార్చేయొచ్చు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అదృష్టం 24 గంటల్లో మారిపోయింది. ఈ 24 గంటల్లోనే ముఖేష్ అంబానీ ఆదాయాల పరంగా చాల మంది పెద్ద పేర్లను కూడా అధిగమించాడు, వారిలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ కూడా ఉన్నారు. అంతేకాదు ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో 7 మంది నష్టాలను చవిచూశారు.నిన్న శుక్రవారం రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. దింతో అంబానీ మొత్తం విలువ కూడా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముఖేష్ అంబానీ నికర విలువ 24 గంటల్లో 2.92 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 వేల కోట్లు) పెరిగింది. మరోవైపు ఈ 24 గంటల్లో ఎలోన్ మస్క్ 558 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5 వేల కోట్లు) నష్టాపోయారు.
అంబానీ కంటే ముందు ఎవరు: గడిచిన 24 గంటల ఆదాయంలో అమెరికన్ పెట్టుబడిదారుడు లారీ ఎల్లిసన్ ముకేశ్ అంబానీ కంటే ముందున్నాడు. ఎల్లిసన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్‌కు ఛైర్మన్ అండ్ CTO కూడా. ఎల్లిసన్ 24 గంటల్లో $3.29 బిలియన్లు సంపాదించారు. ఆదాయాల పరంగా ఎల్లిసన్ తర్వాత ముఖేష్ అంబానీ తరువాత స్థానంలో ఉన్నారు. అంబానీ తర్వాత మూడవ స్థానంలో డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్ మైఖేల్ డెల్ ఉన్నారు. డెల్ మొత్తం విలువ 24 గంటల్లో $2.53 బిలియన్లు పెరిగింది.

ప్రముఖ దిగ్గజాలకు నష్టం : ఈ 24 గంటల్లో చాలా మంది పెద్ద కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇందులో ఎలోన్ మస్క్ మాత్రమే కాకుండా మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ మొదలైన వారు కూడా ఉన్నారు. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల లిస్టులో వీరి పేర్లు ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో లారీ ఎల్లిసన్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్
సంపద మాత్రమే ఈ 24 గంటల్లో పెరిగింది.
ముకేశ్ అంబానీ నికర విలువ: ముఖేష్ అంబానీ నికర విలువ $88.1 బిలియన్లు. ఈ నికర విలువతో అతను ప్రపంచంలోని 17వ ధనవంతుడిగా ఉన్నారు. ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు కూడా. భారతదేశంలోని రెండవ అత్యంత ధనవంతుల లిస్టులో గౌతమ్ అదానీ పేరు ఉండగా, అదానీ నికర విలువ $68.9 బిలియన్లు. అతను ప్రపంచంలోనే 21వ ధనవంతుడు. అలాగే, ముఖేష్ అంబానీ తర్వాత అదానీ ఆసియాలోని అత్యంత ధనవంతుల లిస్టులో రెండవ స్థానంలో ఉన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications