Anant Ambani: అనంత్ పెళ్లి సందడిలో అంబానీ ఫ్యామిలీ.. కొత్తగా 14 నిర్మాణాలు..
Ambani News: దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన వ్యాపారాలు గుజరాత్ జామ్‌నగర్‌లో మూలాలు కలిగి ఉంది. అక్కడ భారీ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, గ్రీన్ ఎనర్జీ పార్క్ ఇంకా అభివృద్ధిలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఓ ఆధ్యాత్మిక ప్రాజెక్టును అంబానీలు తీసుకొస్తున్నారు.
భారతదేశం గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప ఆలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. వాస్తవానికి అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి ముందు వేగంగా 14 దేవాలయాల నిర్మాణం కొనసాగుతోంది. ఇండియాలో రామ మందిరం, అమెరికాలో బాప్స్ టెంపుల్ తర్వాత ఈ మెగా టెంపుల్ నిర్మించాలని అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేయడం ట్రెండ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అంబానీకి ఉన్న ఇళ్లలో సైతం పూజా గదికి ఎక్కువ ప్రాంతాన్ని కేటాయించారు.

ముఖ్యంగా ముంబై, లండన్‌లలో ఇంట్లో ఒక చిన్న దేవాలయం ఉంది. ప్రస్తుతం గుజరాత్‌లోని అంబానీ కుటుంబానికి కంచుకోట అయిన జామ్‌నగర్‌లో 14 ఆలయాలతో భారీ ఆలయ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నీతా అంబానీ చొరవ తీసుకున్నారు. ప్రతి ఆలయం తరతరాలుగా వస్తున్న కళాత్మక సంప్రదాయాన్ని ప్రతిబింబించే విస్తారమైన కళాఖండాలు, దేవతల శిల్పాలు, కుడ్యచిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. నిర్మాణంలో కళాకారులు, శిల్పులతో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్మన్ నీతా అంబానీ మాట్లాడారు.
ఇటీవల ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన నీతా అంబానీ కళాకారుల పని తీరును మెచ్చుకుంటూ కార్మికులు, భక్తులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన వీడియో ఇక్కడ ఉంది. ఈ వీడియో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ తమ ప్రీ వెడ్డింగ్ వేడుకలను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుపుకోనున్నారు.


Click it and Unblock the Notifications