ఇంటి నుండే 10 నిమిషాల్లో కోటి వరకు లోన్.. ముఖేష్ అంబానీ కొత్త గేమ్ ప్లాన్.. !

ఆసియ అత్యంత సంపన్నుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్లు ఇంకా మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టడం ద్వారా మీరు లోన్ తీసుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు మీరు షేర్లు ఇంకా మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టవచ్చు, ఈ సౌకర్యం జియో ఫైనాన్షియల్ యాప్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్రాసెస్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. అది కూడా మీకు కంపెనీ నుండి కేవలం 10 నిమిషాల్లో లోన్ లభిస్తుంది.

mukesh ambani entering into newsegment now Loan up to Rs 1 crore in 10 minutes from home whats the plan

అయితే దీని వడ్డీ రేటు 9.99 శాతం నుండి మొదలవుతుంది ఇంకా మీరు రూ.1 కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ తిరిగి కట్టడానికి మీకు మూడు సంవత్సరాల వరకు సమయం ఇస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గడువు తేదీకి ముందే లోన్ మొత్తాన్ని కడితే ఎటువంటి చార్జెస్ వసూలు చేయదు. జియో ఫైనాన్స్ అనేది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). దింతో జియో ఫైనాన్స్ లిమిటెడ్ కూడా ఇప్పుడు లోన్ బిజినెస్లోకి ప్రవేశించింది. ఈ కంపెనీ ఇప్పుడు ప్రజలకు వారి సెక్యూరిటీలకి ప్రతిఫలంగా అప్పు ఇవ్వబోతోంది. దీని అర్థం మీకు షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లు ఉంటే వాటిని తాకట్టు పెట్టడం ద్వారా మీరు ఈజీగా లోన్ తీసుకోవచ్చు.

షేర్లు అండ్ మ్యూచువల్ ఫండ్లపై రుణాలు: దీనికి సంబంధించి కంపెనీ తాజగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అందులో కస్టమర్లు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ పై లోన్స్ తీసుకోవచ్చు అలాగే షేర్లు ఇంకా మ్యూచువల్ ఫండ్ల వంటి పెట్టుబడులను తాకట్టు పెట్టవచ్చు. డీమ్యాట్ అకౌంట్ అనేది మీ షేర్లు అండ్ మ్యూచువల్ ఫండ్‌లను కొని దాచుకునే ఒక రకమైన బ్యాంక్ అకౌంట్. జియో ఫైనాన్స్ ప్రకారం, లోన్ ప్రాసెస్ చాలా సులభం ఇంకా సురక్షితమైనది. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్'గా ఉంటుంది, కాబట్టి ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీరు జియో ఫైనాన్స్ యాప్ ద్వారా మీ ఇంటి నుండే లోన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే లోన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

9.99 శాతం నుండి వడ్డీ రేట్లు : లోన్ పై వడ్డీ రేటు 9.99 శాతం నుండి ప్రారంభమవుతాయి. మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఈ రేటు మారవచ్చు. మీరు హై-రిస్క్ కస్టమర్ అయితే మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు తక్కువ రిస్క్ కస్టమర్ అయితే మీరు తక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం ద్వారా మీరు రూ. 1 కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. దీని వళ్ళ మీకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. జియో ఫైనాన్స్ ఈ కొత్త ఫీచర్ అత్యవసరంగా డబ్బు అవసరమైన వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+