పాకిస్థానీలపై అంబానీ మ్యాజిక్.. అక్కడ కూడా మనోడే టాప్.. గూగుల్లో ఎం వెతికారంటే..?
గూగుల్ లో మనకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని సెర్చ్ చేస్తుంటాం. కొన్ని సార్లు మనకు తెలిసిన సమాచారం గురించి మరింతగా తెలుసుకోవడానికి లేదా అవగాహనా కోసం సెర్చ్ చేస్తుంటాం. ఈ ఏడాది అంబానీ మాయాజాలం పాకిస్థానీలపై కూడా పని చేసింది. ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి పాకిస్థాన్‌లో కూడా మంచి పేరు మూటకట్టుకున్నాడు. ఏంటంటే పాకిస్తాన్‌లో 2024 ఏడాదికి సంబంధించిన గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. దీని బట్టి ముకేశ్ అంబానీ క్రేజ్ అంచనా వేయవచ్చు. పాకిస్తాన్ ప్రజలు ముఖేష్ అంబానీ గురించి చాలా విషయాలు సెర్చ్ చేశారట. ఇందులో అతని సంపద నుండి కొడుకు పెళ్లి వరకు ప్రతిదీ ఉంది.
2024లో పాకిస్థానీలు ఏం సెర్చ్ చేశారో తెలిపే డేటాను గూగుల్ విడుదల చేసింది. ఇందులో ముఖేష్ అంబానీ, అతని కుటుంబం గురించి పాకిస్థానీలు ఎక్కువగా సెర్చ్ చేసారు. గూగుల్‌లో పాకిస్థానీయులు సెర్చ్ చేసిన వాటిలో ముఖేష్ అంబానీ సంపద, ముఖేష్ అంబానీ కొడుకు, ముఖేష్ అంబానీ కొడుకు వివాహం, ముఖేష్ అంబానీ ఇల్లు మొదలైనవి ఉన్నాయి.

ఇండియా గురించి ఇంకా ఎం సెర్చ్ చేసారంటే ?
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, సింధ్, పంజాబ్, ఇస్లామాబాద్‌ల ప్రజలు ముఖేష్ అంబానీ గురించి ఎక్కువగా సెర్చ్ చేసారు. ముఖేష్ అంబానీతో పాటు పాకిస్థానీలు భారతదేశానికి సంబంధించి చాల ఇతర విషయాల గురించి కూడా సెర్చ్ చేసారు. అందులో బాలీవుడ్ సినిమాలు, కొన్ని షోలు ఉన్నాయి. ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా 'హిరమండి'. ఇది కాకుండా 12th ఫెయిల్, ఆనిమల్, స్ట్రీ 2, మీర్జాపూర్, బిగ్ బాస్ గురించి కూడా సెర్చ్ చేసారు.
అంబానీ మొత్తం సంపద విలువ ఎంతంటే ?
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముఖేష్ అంబానీ మొత్తం సంపద విలువ 90.7 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల లిస్టులో అతను 17వ స్థానంలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకు ఈ లిస్టులో ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉండగా తరువాత అతని సంపద విలువ పడిపోయింది. దింతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ముఖేష్ అంబానీ 5.62 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రతి ఏడాది చివరిలో గూగుల్ మోస్ట్ సెర్చ్ లిస్ట్ విడుదల చేస్తుంది. ఇందులో ప్రముఖుల నుండి ప్రతి టాపిక్ సంబందించి వెల్లడిస్తుంది. అయితే ఈ లిస్ట్ ఏడాది మొత్తం జరిగిన సంఘటనలు ఆధారంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications