Billionaire Families: దేశంలో అత్యంత సంపన్న కుటుంబాలు 300.. అందులో వారిదే అగ్రస్థానం..
దేశంలో సంపన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. గత రెంగడు సంవత్సరాల్లో ధనవంత కుటుంబాల ఆదాయం భారీగా పెరిగింది. 300 అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల ఇన్ కమ్ భారీ స్థాయికి చేరింది. వారి రోజుకు సగటున రూ.4,076 కోట్లు సంపాదిస్తున్నారు. గత రెండేళ్లలో వీరంతా రూ.30 లక్షల కోట్లు సంపాదించారు. దీంతో వారి సంపద రూ. రూ.138 లక్షల కోట్లకు చేరింది. ఇందుకు సంబంధించి 2026 బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్ లిస్ట్ విడుదల చేసింది. నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, పోలండ్ వంటి దేశాల జీడీపీ విలువ కంటే వీరి మొత్తం సంపద ఎక్కువని తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూసినా ఈ కుటుంబాల సంపద మాత్రం 27.5% పెరిగింది.
దేశంలో ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ సంపదలో తొలి స్థానంలో కొనసాగుతోంది. వీరి కుటుంబ సంపద విలు గత సంవత్సరం కాలంగా 8.5 శాతం తగ్గినా.. రూ.25,82 లక్షల కోట్లుగా ఉంది. కుమార్ మంగళ బిర్లా కుటుంబం రూ.8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 300 సంపన్న కుటుంబాలు 54 లక్షల మందికి ఉద్యోగం కల్పించారు. ఈ కుటుంబాలు ట్యాక్స్ రూపంలో ఇవి రూ.1.9 లక్షల కోట్లు కట్టాయి. ఇది దేశ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్లలో 17 శాతానికి సమానంగా ఉంది. ఈ 300 సంపన్న కుటుంబాల జాబితాలో డాక్టర్ రెడ్డిస్ కుటుంబం రూ.1,13,300 కోట్ల సంపదతో 24వ స్థానంలో నిలిచింది.

ఈ సంవత్సరం విడిగా తొలి తరం కుటుంబ వ్యాపారాలకు చెందిన 100 ర్యాంకులతో జాబితా విడుదల చేశారు. వీరి మొత్తం సంపద రూ.77.8 లక్షల కోట్లుగా ఉన్నట్లు వివరించారు. మొత్తం కలిపితే దేశంలో 400 అత్యంత సంపన్న కుటుంబాలు ఉన్నట్లు లెక్క. వీరి సంపద విలువ రూ. రూ.215.8 లక్షల కోట్లు ఉంటుంది. తొలి తరం విభాగంలో గౌతమ్ అదానీ కుటుంబం రూ.19.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సునీల్ భారతీ మిత్తల్ రూ.12.1 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. దిలీప్ సంఘ్వి రూ.4.55 లక్షల కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పూనావాలా రూ.2.98 లక్షల కోట్లతో నాల్గో స్థానం, దమానీ రూ.2.86 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
హైదరాబాద్‌లో దిగ్గజ కంపెనీలు 9 ఉండగా, 15 తొలి తరం కంపెనీలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తొలి తరం కంపెనీల్లో ముంబయిలో 24, దిల్లీలో 18 చొప్పున ఉన్నాయి. మహిళలు కూడా సంపన్న కుటుంబాలకు నాయకత్వం వహిస్తున్నారు. లిస్ట్ లో 18 కంపెనీల పగ్గాలు మహిళల చేతుల్లోనే ఉన్నాయి. అత్యంత విలువైన మహిళా నాయకత్వ కంపెనీగా హిందుస్థాన్ జింక్ నిలిచింది. ప్రియా అగర్వాల్ హెబ్బర్ ఆధ్వర్యంలోని ఈ కంపెనీ విలువ రూ.4.45 లక్షల కోట్లుగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications