Mukesh Ambani: ఖరీదైన ఆస్తుల కొనుగోలు విషయంలో తన రికార్డులను తానే బద్ధలు కొడుతున్నారు భారత కుబేరుడు ముఖేష్ అంబానీ. గతంలో చిన్న కొడుకుకోసం దుబాయ్ లో ఒక ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలుచేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో మరో సారి వార్తల్లో నిలిచారు.

బీచ్ వ్యూ కోసం..
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనికులు దుబాయ్ కేంద్రంగా ప్రాపర్టీలను కొనుగోలుచేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. ఈసారి రియలయన్స్ అధినేత అక్షరాలా రూ.1,350 కోట్లను వెచ్చించి కళ్లు చెదిరే భవంతిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం దుబాయ్ రియల్టీకి అనేక మంది సంపన్నులు దగ్గరవుతున్నారు. అక్కడి లగ్జరీ బీచ్ హౌసెస్ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

అంతా ప్రైవేట్ గా..
అంబానీ దుబాయ్‌లోని పామ్ జుమేరియా మాన్షన్‌లో ఖరీదైన ఆస్తిని కొనటంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇది వారి పర్ననల్ వ్యవహారం కావటంతో విషయాన్ని ప్రైవేట్ గానే ఉంచినట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. ఇది కువైట్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయా కుటుంబానికి చెందిన విల్లాగా తెలుస్తోంది. రియల్టర్లు సృష్టించిన ఈ చిన్న దీవిలో రిసార్టులు, హోటళ్లు, టవర్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి.

యూరప్ లోనూ కొనుగోళ్లు..
బిలియనీర్ అంబానీ 79 మిలియన్ డాలర్లతో యూకేలోని ఐకానిక్ కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్ లో ప్రాపర్టీని కొనుగోలు చేయనున్నట్లు సంచారం. గత ఏడాది కాలంలో ఎమిరేట్స్ ప్రైమ్ ప్రాపర్టీ ధరలు ఏకంగా 70 శాతం పెరిగాయి. ప్రపంచ నలుమూల్లోని ధనవంతుల ఆదరణ కారణంగా ఈ పెరుగుదల ఉందని తేలింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications