Reliance AI: AIపై ముఖేష్ అంబానీ దృష్టి.. జియో ఎయిర్ ఫైబర్ లాంచ్ ఎప్పుడంటే..??
Reliance AGM: ప్రస్తుతం కొనసాగుతున్న గ్లోబల్ AI విప్లవం మన చుట్టుపక్కల అనేక మార్పులకు దారితీస్తోందని ముఖేష్ అంబానీ అన్నారు. భారత అవసరాలకు అనుగుణంగా ఏఐ మోడళ్లను జియో ప్లాట్‌ఫారమ్‌లు రూపొందిస్తాయని వెల్లడించారు. ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించటంలో ముందంజలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇంటర్నెట్ వినియోగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న వేళ 5జీ సాంకేతికత విస్తరణపై జియో ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దేశంలోని అనేక నగరాల్లో వేగంగా తన 5జీ రోలవుట్ చేస్తోంది. ఈ క్రమంలో రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ, Jio True5G డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రకటించారు. 5G నెట్‌వర్క్, ఎడ్జ్ కంప్యూటింగ్, అప్లికేషన్‌లు, సేవల స్పెక్ట్రమ్‌ను కలిపే సమగ్ర ప్లాట్‌ఫారమ్‌గా దీనిని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమల ట్రాన్ఫర్మేషన్ వేగవంతం చేసేందుకు జియో ట్రూ5జీ ల్యాబ్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదే క్రమంలో ఆకాష్ అంబానీ జియో స్మార్ట్ హోమ్ సేవలను పరిచయం చేశారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగం 80 శాతం ఇళ్లలోనే జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో జియో స్మార్ట్ హోమ్ సేవలను పరిచయం చేయడంలో తాను థ్రిల్‌గా ఉన్నానని తెలిపారు. కంపెనీ పురోగతి గురించి మాట్లాడుతూ జియో ఫైబర్ సేవ ఇప్పటికే 10 మిలియన్లకు పైగా కస్టమర్లను కనెక్ట్ చేసిందని అన్నారు. ఈ క్రమంలో Jio AirFiber ఆగమనం దాని పరిధిని 200 మిలియన్ల గృహాలు, వివిధ ప్రాంగణాలకు విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జియో ఫైబర్ సేవలను సెప్టెంబర్ 19న దేశవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ తేదీని ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఇది కంపెనీ ఆదాయ వృద్ధికి మరో కొత్త మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ద్వారా రోజుకు 150,000 కనెక్షన్‌లతో ఈ విస్తరణను సూపర్‌ఛార్జ్ చేయవచ్చని తెలిపారు.


Click it and Unblock the Notifications