Ambani News: జియో Vs అనంత్ మ్యారేజ్.. అంబానీని నెట్టింట్లో ఆడుకుంటున్న ట్రోలర్స్..
Trolls on Ambani: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టెలికాం వ్యాపారం రిలయన్స్ జియో. తాజాగా గడచిన వారంలో మెుదటగా మెుబైల్ టారిఫ్ పెంపులను ప్రకటించిన కంపెనీ ధరల పెంపుకు ఆజ్యం పోసింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇటీవల భారతీయ సంపన్నుడు ముఖేష్ అంబానీ తన చివరి కుమారుడు అనంత్ వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అనంత్-రాధికా మర్చంట్ పెళ్లి కోసం ఇప్పటికే ఖరీదైన వెడ్డింగ్ కార్డులు సైతం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. పెళ్లి ఏర్పాట్ల కోసం అంబానీ కుటుంబం వందల కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రపంచ నలుమూలల నుంచి అతిధులను సైతం ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉండగా రిలయన్స్ జియో టారిఫ్ పెంపులకు కారణం అనంత్ అంబానీ పెళ్లి అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంబానీ తన కుమారుడు అనంత్ పెళ్లి వేడుకల కోసం ఖర్చు చేస్తున్న డబ్బును వసూలు చేసేందుకే తాజాగా జియో టారిఫ్ రేట్లు పెంచారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. నీ కొడుకు పెళ్లి ఖర్చులను మా నుంచి వసూలు చేస్తున్నావ్ అంటూ అంబానీని అటాక్ చేస్తున్నారు. పెళ్లి ఖర్చుల భారాన్ని టెలికాం యూజర్లపై వేయటం సరికాదని కొందరు స్పందిస్తున్నారు. దేశంలోని అగ్రవ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి ఖర్చును దేశప్రజలపై వేటం సమంజసం కాదంటూ ట్రోలర్లు అంబానీని నెట్టింట అటాక్ చేయటం ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో చర్చకు దారితీసింది.
రిలయన్స్ జియో జూలై 3 నుంచి పెరిగిన టారిఫ్ రేట్లు అమలులోకి వస్తాయని ఇప్పటికే ప్రకటించింది. చాలా కాలంగా టారిఫ్ రేట్ల పెంపుకోసం ఎదురుచూస్తున్న వొడఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ తాజాగా జియో రేట్ల పెంపుతో ముందడుగు వేశాయి. తమ ఆదాయాలను పెంచుకునేందుకు తగినట్లుగా ప్లాన్ రేట్లను అప్‌గ్రేడ్ చేశాయి. దీనికి తోడు గత కొంత కాలంగా దేశంలోని టెలికాం ఆపరేటర్లు 5జీ రోలవుట్ చేసేందుకు అవసరమైన ఇన్ ఫ్రా, టెక్నాలజీ కోసం వేల కోట్లు వెచ్చిస్తున్నాయి. అయితే ఈ డబ్బును తిరిగి పొందేందుకు ప్రస్తుతం టారిఫ్స్ పెంపు కంపెనీలకు తప్పటం లేదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో పనిచేస్తున్న మొత్తం 5జీ మెుబైల్స్ లో దాదాపు 85% జియో నెట్‌వర్క్ లోనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications