మార్కెట్ దెబ్బ: 11 ఏళ్లలో తొలిసారి.. ముఖేష్ అంబానీ, రిలయన్స్‌కు భారీ దెబ్బ
కరోనా వైరస్, రష్యా-సౌదీ అరేబియా ధరల యుద్ధం, యస్ బ్యాంకు సంక్షోభం, ఎఫ్‌పీఎలు వెనక్కి. ఇలా వివిధ కారణాలతో గత కొన్నాళ్లుగా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రష్యా-సౌదీ ధరల యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం చమురు రంగంపై తీవ్రంగా పడింది. ఏ చమురు రంగం వల్ల భారత్‌తో పాటు ఆసియా నెంబర్ వన్‌గా నిలిచారో.. ఇప్పుడు అదే ప్రభావంతం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారీ నష్టాలు చవిచూశారు.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

11 ఏళ్లలో మొదటిసారి..
ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 13 శాతం పడిపోయింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పాటు కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తులు కూడా కరిగిపోయాయి. గత 11 ఏళ్ల కాలంలో రిలయన్స్ ఇంతలా భారీ నష్టాలను చవిచూడటం ఇది తొలిసారి. రిలయన్స్ షేర్లు పడిపోవడంతో మార్కెట్ క్యాప్ పరంగా రారాజుగా ఉన్న RIL ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. టీసీఎస్ మొదటి స్థానంలో నిలిచింది.

రూ.44,000 కోట్లు..
రిలయన్స్ మార్కెట్ క్యాప్ తరిగిపోవడంతో ముఖేష్ ఆస్తులు ఏకంగా రూ.44,000 కోట్లు తగ్గాయి. రిలయన్స్ షేర్ రూ.1,095కు తగ్గడంతో సంపద తగ్గింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ నెట్ వర్త్ ప్రకారం ముఖేష్ అంబానీ నెట్ వర్త్ 41.8 బిలియన్ డాలర్లుగా ఉంది. సోమవారం మధ్యాహ్నం గం.1.45 సమయానికి అతని సంపాదన ఏకంగా 12.40 శాతం తగ్గింది. అయితే మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి షేర్ మరో రూ.10 వరకు పెరిగింది. దీంతో కొంతమేర పెరగొచ్చు. మొత్తంగా సంపద మాత్రం భారీగానే తగ్గింది.

అంతర్జాతీయ పరిణామాలు..
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ రోజు ఒక్కరోజే ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా తగ్గింది. రిలయన్స్ స్టాక్ రూ.1,000 నుండి రూ.1,600కు ఎంత వేగంగా వెళ్లిందో.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అంతే స్థాయిలో వెనక్కి వచ్చింది.


Click it and Unblock the Notifications