Reliance Robots: అంబానీ కన్ను రోబోలపై.. టెస్లాకు రిలయన్స్ పోటీ! దేశంలో తొలిసారిగా..
Ambani Robots: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొన్నాళ్లుగా టెక్ కేంద్రంగా విస్తరిస్తున్నారు. జియో విజయం తర్వాత పెట్రోలియం, రిటైల్, టెలికాం నుంచి అడుగులు ఏఐ, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు టెక్నాలజీపై పడింది. అమెరికాలో ఎలాన్ మస్క్ టెస్లా మాదిరిగానే ఇండియాలో అంబానీ కూడా రోబోటిక్ టెక్నాలజీపై తన దృష్టిని పెట్టారని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది.
ఈ క్రమంలో ముఖేష్ అంబానీ ఫండ్ చేసిన నేతృత్వంలోని స్టార్టప్ కంపెనీ యాడ్‌వెర్బ్ టెక్నాలజీస్ పెద్ద ప్రకటన చేసింది. 2025 నాటికి దేశంలో తొలి హ్యూమనాయిడ్ రోబోలను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనతో భారత్ సైతం అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన టెస్లా, బోస్టన్ డైనమిక్స్, ఎజిలిటీ రోబోటిక్స్ వంటి సంస్థలతో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న అంతర్జాతీయ సంస్థలు సైతం ఇప్పటికే భవిష్యత్తు కోసం హ్యూమనాయిడ్ రోబోలను లాంచ్ చేసేందుకు టెక్నాలజీపై పనిచేస్తున్నాయి.

అంబానీ ఫండింగ్ చేసిన యాడ్‌వెర్బ్ టెక్నాలజీస్ స్టార్టప్ కంపెనీ ఇప్పటికే అధునాతన ఆటోమేషన్ సొల్యూషన్స్ అందించటంతో ప్రసిద్ధి చెందింది. స్టార్టప్ ప్రస్తుతం ఫ్యాషన్, రిటైల్ అండ్ ఎనర్జీ వంటి విభిన్న పరిశ్రమల్లో సంక్లిష్టమైన పనులను నిర్వహించడానికి తన హ్యూమనాయిడ్ రోబోట్‌లతో కొత్త పుంతలు తొక్కడానికి సిద్ధంగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో స్టార్టప్ రోబోట్‌లకు శక్తినివ్వడానికి జియో AI ప్లాట్‌ఫారమ్, 5G సేవలను విరివిగా వినియోగించుకుంటోందని తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతను పొందుపరచడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్టార్టప్ ఉపయోగించుకుంటోంది. వీటి రూపకల్పన ద్వారా మార్కెట్లో డల్, డేంజరస్, డర్జీ ఉద్యోగాలను మార్కెట్లో తొలగించాలని చూస్తున్నట్లు యాడ్‌వెర్బ్ టెక్నాలజీస్ సహవ్యవస్థాపకుడు, సీఈవో సంగీత్ కుమార్ వెల్లడించారు.
యాడ్‌వెర్బ్ తయారు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్‌లు అధునాతన GPU సాంకేతికత, శక్తి-సమర్థవంతమైన యాక్యుయేటర్‌లు, డ్యూయల్ ఆర్మ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇవి క్లిష్టమైన పనులను సైతం సులువుగా నిర్వహించగలవని తెలుస్తోంది. టెస్లా తయారు చేసిన ఆప్టిమస్ రోబోలు మార్కెట్లను డామినేట్ చేస్తాయని వీటి ధర 20-25 వేల డాలర్ల మధ్య ఉన్నప్పటికీ వాటితో పోటీ పడగలమని దేశీయ స్టార్టప్ కంపెనీ ఆశాజనకంగా ఉంది. హ్యూమనాయిడ్ రోబోలు నిర్మించడానికి భారీ పెట్టుబడులు అవసరం, అయితే ప్రభుత్వ రాయితీల నుండి లబ్ది పొందుతున్న చైనాతో సహా గ్లోబల్ ప్లేయర్‌ల డామినేషన్ ఈ రంగంలో తట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఈవో వెల్లడించారు. ఇది చూస్తుంటే రానున్న రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద టెక్ జెయింట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications