రిలయన్స్ షేర్ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లపాటు కంపెనీ పగ్గాలు పదిలం..
దేశంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనసాగుతూ వస్తోంది. సంస్థ ఆ స్థానంలో ఉండటానికి దాని అధినేత ముఖేష్ అంబానీ చేసిన కృషి వెలకట్టలేనిది. తండ్రి ధీరూభాయ్ అంబానీకి తగ్గ తనయుడిగా తన వ్యాపార దక్షతతో కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చారు. మరో ఏడాదిలో ఆయన పదవీకాలం ముగియనుండగా.. రిలయన్స్ పరిస్థితి ఏమవుతుందోననే అందోళన మార్కెట్ వర్గాల్లో ఉంది.
రిలయన్స్ సంస్థల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ముఖేష్ అంబానీ పదవీ కాలం ఏప్రిల్ 19, 2024న ముగియనుంది. అయితే కంపెనీ ఎదుగుదలకు ఆయన చేసిన కృషిని వాటాదారులందరూ గుర్తించారు. దీంతో మరో 5 ఏళ్లపాటు రిలయన్స్ పగ్గాలను ముఖేష్ అంబానీకే అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఆయన వయస్తు 66 ఏళ్లు. కాగా నిబంధనల ప్రకారం 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఛైర్మన్ మరియు MD పదవిలో కొనసాగడానికి అర్హులు కారు. ఇందుకోసం ప్రత్యేక తీర్మానాన్ని వాటాదారులు ఆమోదించాల్సి ఉంటుంది. అది కాస్తా పాస్ కావడంతో ఏప్రిల్ 2029 వరకు రిలయన్స్ సంస్థలకు ముఖేష్ ఛైర్మన్ & MDగా వ్యవహరించనున్నారు.
1997 నుంచి ముఖేష్ అంబానీ రిలయన్స్ బోర్డులో కొనసాగుతున్నారు. 2002లో ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం కంపెనీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 2020 నాటికి ఆయన వేతనం ఏడాదికి 15 కోట్లు. కాగా కొవిడ్ సంక్షోభ సమయం నుంచి ఏమాత్రం జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారు. తాజాగా మరో 5 ఏళ్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించగా.. ఈ పీరియడ్ లోనూ వేతనమేమీ తీసుకోనని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications