Mukesh Ambani: యాంటీలియా అంతటా 'రామ నామం'.. భక్తిని చాటుకున్న ముఖేష్ అంబానీ
Jai Shri Ram: భగవంతుని ముందర కుభేరుడైనా సామాన్యుడే. దేశంలోనే కాక ఆసియాలోనే సంపన్నుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అయోధ్య శ్రీరామునిపై తన అభిమానాన్ని పంచుకున్నారు.
అయోధ్యలో రామమందిరప్రాణ ప్రతిష్ఠా వేడుకకు భారత్ సిద్ధమవుతున్న వేళ ముంబైలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ ప్రైవేటు నివాసం యాంటిలియా 'జై శ్రీరామ్' నినాదాలతో వెలిగిపోయింది. లేజర్ లైట్లతో శ్రీరాముని ఆలయ నమూనా, జై శ్రీరామ్ నినాదాల కాంతులతో వెలిగిపోయింది. రాముని పేరుతో కాంతులీనిన ఇంటిని చూసేందుకు అనేక మంది ఆసక్తి కనబరచగా దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్నాయి. రిలయన్స్ కూడా రామాలయాన్ని జరుపుకోవడానికి యాంటిలియా వద్ద భారీ భండారాను నిర్వహిస్తోంది.
Ayodhya ram mandir Inauguration Live:సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్యాపురి..!

నేడు అయోధ్యలో జరిగే పవిత్రోత్సవానికి ఆహ్వానించబడిన ప్రముఖ వ్యాపారవేత్తల్లో నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లతో పాటు పారిశ్రామికవేత్త ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు హాజరయ్యేందుకు చేరుకున్నారు.
ఇదే క్రమంలో రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా అయోధ్యకు చేరుకున్న వీడియోను విడుదల చేశారు. "ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ముందు అయోధ్యలో ఘన స్వాగతం. రామమందిరంలో లక్షలాది మంది భక్తులతో ఈ చారిత్రాత్మక దినాన్ని జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను" అని సింఘానియా ట్వీట్ ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications