Mukesh Ambani: ఎప్పటికీ రిలయన్స్ గుజరాతీ కంపెనీనే.. అంబానీ 5 వాగ్ధానాలు ఇవే..
Vibrant Gujarat Summit 2024: ప్రస్తుతం దేశంలోని బడా వ్యాపారులందరూ కలిసి పెట్టుబడులపై ప్రకటనలు చేస్తున్న ఈవెంట్ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024. ఇందులో భాగంగా ముఖేష్ అంబానీ తన మూలాలను గుర్తు చేసుకున్నారు.
ధీరూభాయ్ స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీగానే మిగిలిపోతుందని అంగీకరించారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ యొక్క ప్రతి ఎడిషన్‌లో తాను పాల్గొన్నానన్నారు. తన చిన్న తనంలో తండ్రి ధీరూభాయ్ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ.. గుజరాత్ మీ మాతృభూమి, గుజరాత్ ఎప్పుడూ అలాగే ఉండాలని చెప్పారన్నారు. 7 కోట్ల మంది గుజరాతీల కలలను నెరవేర్చేందుకు రిలయన్స్‌లోని ప్రతి వ్యాపార సంస్థ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు.

తానొక గుజరాతీ అయినందుకు గర్విస్తున్నానని అంబానీ ప్రసంగంలో అన్నారు. రానున్న కాలంలో రిలయన్స్ గణనీయమైన పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నరు. 2030 నాటికి రాష్ట్రంలోని సగం గ్రీన్ ఎనర్జీ అవసరాలను తీర్చటంలో ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ధీరూభాయ్ అంబానీ గిగా కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోందని, రిలయన్స్ జియో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ మౌలిక సదుపాయాలను ప్రూర్తిచేసిందన్నారు. 5G- ఎనేబుల్డ్ AI విప్లవాలు గుజరాత్ ఆర్థిక వ్యవస్థను ఉత్పాదకత, మరింత సమర్ధవంతంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీగా మారుస్తాయని ఆయన అన్నారు
రానున్న కాలంలో ఏఐ సాంకేతికత వైద్యులు, ఉపాధ్యాయులు, రైతులకు మేలు చేకూరుస్తుందన్నారు. అలాగే రిలయన్స్ రిటైల్ నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందజేస్తుందని, గుజరాత్‌లోని రైతులకు సాధికారత కల్పిస్తుందని అంబానీ హామీ ఇచ్చారు. రిలయన్స్ గ్రూప్ దేశంలో మొట్టమొదటి కార్బన్ ఫైబర్ సౌకర్యాన్ని హజీరాలో ఏర్పాటు చేస్తుందని అంబానీ చెప్పారు. అలాగే 2036 ఒలింపిక్స్ కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications