Mukesh Ambaniకి భారీ షాక్.. రూ.273 కోట్లు నష్టపోయిన కంపెనీ, మీ దగ్గర ఈ షేర్లున్నాయా..?

Alok Industries Results: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను వరుసగా ప్రకటిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు దీనికి అనుగుణంగా తమ పెట్టుబడి పోర్ట్‌ఫోల్లో మార్పులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా వంటి కంపెనీల పెట్టుబడిదారులు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలపై తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ముఖేష్ అంబానీ వాటాలను కలిగిన అలోక్ ఇండస్ట్రీస్ కంపెనీ గురించే. కంపెనీ తన మూడవ త్రైమాసిక ఫలితాల్లో పెట్టుబడిదారులను పూర్తిగా నిరాశకు గురిచేసింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలంలో కంపెనీ భారీ నష్టాన్ని నివేదించింది. కంపెనీ విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఈ కాలంలో రూ.273 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.230 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మీక్షిస్తున్న త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 31 శాతం క్షీణించి రూ.864 కోట్లకు పడిపోయాయి.

Mukesh Ambani s Alok Industries recorded 273 crores loses in Q3 Stock Falling

గతవారం మార్కెట్ల ముగింపు సమయంలో షేర్లు 2 శాతం మేర క్షీణతను నమోదు చేసి ఒక్కోటి రూ.20 వద్ద స్థిరపడ్డాయి. వాస్తవానికి ఈ కంపెనీ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, JM ఫైనాన్షియల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రెండవ త్రైమాసికంలో సెప్టెంబర్ కాలంలో కంపెనీ నికర నష్టం రూ.262.10 కోట్లుగా నిలిచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఖర్చులు 25.45 శాతం తగ్గి రూ.1,160.63 కోట్లకు చేరుకున్నాయి.

కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే.. గడచిన మూడు నెలల కాలంలో స్టాక్ 14.45 శాతం పడిపోయాయి. అలాగే ఆరు నెలల్లో షేర్లు 24.47 శాతం క్షీణించగా, ఏడాది కాలంలో కంపెనీ షేర్లు 37.25 శాతం క్షీణతను చూశాయి. అలాగే దీర్ఘకాలంలో స్టాక్ పనితీరును పరిశీలిస్తే ఐదేళ్ల కాలంలో 614.7 శాతం రాబడిని ఇచ్చింది.

కంపెనీ వ్యాపారం..
అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోని అతిపెద్ద నిలువుగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ హోమ్ టెక్స్‌టైల్స్, కాటన్ నూలు, అపెరల్ ఫాబ్రిక్, గార్మెంట్స్, పాలిస్టర్ నూలు ద్వారా ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను అందిస్తూ ఐదు ప్రధాన విభాగాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ దాదాపు 40 ఏళ్లుగా వ్యాపారంలో ఉంది. అలోక్ వస్త్ర పరిశ్రమలో ముందంజలో ఉంది. నమ్మకమైన డెలివరీ షెడ్యూల్‌లు, అంతర్జాతీయంగా పోటీతత్వ లక్షణాలతో అధిక నాణ్యత గల వస్త్ర ఉత్పత్తులను అందించటంలో కంపెనీ ముందువరుసలో ఉన్న కంపెనీలతో పోటీపడుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+