Mukesh Ambani: మనందరికీ బాగా తెలుసు ప్రముఖ వ్యాపారవేత్త ఏదైనా కొత్త వ్యాపారంలోకి దిగరంటే మిగిలిన ఆటగాళ్లను ఎలిమినేట్ చేస్తారని. ఆయన వేసే ఎత్తులకు ప్రత్యర్థులు చిత్తు కావటం చాలా సార్లు చూశాం.
మరోసారి ముఖేష్ అంబానీ ఇదే రిపీట్ చేసేందుకు రంగంలో దిగుతున్నారు. దీనికి ముందు టెలికాం, ఓటీటీ స్టీమింగ్ వ్యాపారాల్లో ఎలా ఆధిపత్య స్థానాన్ని సాధించారో కళ్లారా మనందరం చూశాం. తాజాగా ఆయన ఫోకస్ ఫైనాన్స్ వ్యాపారంపై పడిందని తెలుస్తోంది. ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెద్ద మార్పుకు, పోటీకి దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ నేడు రూ.261.80 రేటు వద్ద షేరు ధర నిర్ణయించబడింది. ఈ సంస్థ ప్రధానంగా ఆన్ లైన్ లెండింగ్, కన్జూమర్ డ్యూరబుల్ ఫైనాన్సింగ్ రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంబానీ ఇందులోకి అడుగు పెట్టనంత వరకు బజాజ్ ఫైనాన్స్ ఈ వ్యాపారంలో అతిపెద్ద ప్లేయర్‌గా ఉంది. దీనికి తోడు ఇదే వ్యాపారంలో ఉన్న ఇతర చిన్న కంపెనీలు ఆందోళన చెందటం ప్రారంభించాయి. దీనికి ముందు రిటైల్ వ్యాపారంపై రిలయన్స్ గ్రూప్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
మార్కెట్లో అత్యంత తక్కువ ధరలకు ఉత్పత్తులు, సేవలను అందించడం ద్వారా అనతి కాలంలోనే ఎక్కువ వ్యాపారాన్ని, కస్టమర్లను పొందుతూ ఇతర వ్యాపారం సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేయటం అంబానీ వ్యాపార నైజం. భారతీయులు ప్రధానంగా డిస్కౌంట్స్, ఆఫర్స్, ఉచితాలు, తక్కువ రేట్లు వంటి వాటికి ఆకర్షితులౌతారని బాగా తెలిసిన అంబానీ ఎరవేసి వినియోగదారులను తన వ్యాపార వలలోకి లాక్కుంటుంటారు.
అంబానీకి ఉన్న వివిధ వ్యాపారాల ద్వారా అనేక మంది రిటైల్ వినియోగదారులను కలిగి ఉంది. వారికి సంబంధించిన డేటా కూడా కంపెనీల వద్ద ఉంది. దీనిని ఉపయోగించుకుని తక్కువ వడ్డీకి రుణాలు ఆఫర్ చేసేందుకు Jio యాప్ ద్వారా బిలియన్ల మంది కస్టమర్లను ఆకర్షించగలదు. అలాగే ప్రజలు తీసుకున్న రుణ మెుత్తాలని తిరిగి రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో కొనుగోలుకు వినియోగించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇది రెండు లాభాలను తెచ్చిపెట్టనుంది. B2B వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో ఇటీవల మెట్రో కంపెనీని సైతం సొంతం చేసుకున్నారు.
Jio 2015లో పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ని పొందింది మరియు 2019లో పేమెంట్ టెర్మినల్ వ్యాపారాన్ని ప్రారంభించి, వ్యాపారులకు PoS మెషీన్‌లను పంపిణీ చేసింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications