రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ది రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఈ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకులు, సీఈవో జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉన్నారు.
2019 సంవత్సరానికి గాను పోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో నిలిచారు. గురువారం సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి రిలయన్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. రిలయన్స్ ఆస్తులు రూ.10 లక్షల కోట్ల కు చేరుకున్నాయి. ఇందులో సగం వాటా ముఖేష్, ఆయన కుటుంబానిదే. దీంతో వారి ఆస్తి భారీగా పెరిగింది.

షేర్లు పుంజుకొని, ఆస్తులు పెరగడంతో ముఖేష్ అంబానీ 60 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. జెఫ్ బెజోస్ 113 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. 1.7.4 బిలియన్ డాలర్లతో గేట్స్ రెండో స్థానంలో, 107.2 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ అర్నాల్డ్ మూడో స్థానంలో నిలిచారు. 86.9 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ నాలుగో స్థానంలో, ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్ 74.9 డాలర్లతో 5వ స్థానంలో నిలిచారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications